చంద్రబాబుకు దూరమవుతున్న సీఎం మమత... జగన్‌కు దగ్గరవుతున్నారా?

ఇదే సమయంలో మమత సైతం చంద్రబాబు విషయంలో ప్లేటు ఫిరాయించినట్లు తెలుస్తోంది. నిన్నమొన్నటివరకు బాబుకు మద్దతుగా నిలిచిన మమత ఎన్నికలసమయంలో సైతం టీడీపీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. అయితే ఇప్పుడు మాత్రం ఆమె కొత్తరాగం అందుకున్నారన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి.

news18-telugu
Updated: April 20, 2019, 12:24 PM IST
చంద్రబాబుకు దూరమవుతున్న సీఎం మమత... జగన్‌కు దగ్గరవుతున్నారా?
చంద్రబాబు, మమతా బెనర్జీ
news18-telugu
Updated: April 20, 2019, 12:24 PM IST
ఏపీలో ఎన్నికల ముగిసిన తర్వాత టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎన్నికల ఫలితాలు చాలావరకు జగన్‌కే అనుకూలంగా ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. దీంతో జాతీయ నాయకులు సైతం జగన్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. నిన్నటివరకు చంద్రబాబుకు తోడు నీడగా ఉన్న టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పడు బాబుకు దూరమవుతున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు వైఖరి ఇందుకు కారణమని తెలుస్తోంది. గతకొన్నిరోజులుగా చంద్రబాబు నాయుడు ఈవీఎం అంశాల నుంచి ఈసీ వైఖరి పట్ల ప్రతీ విషయంపై తన అసహనం వ్యక్తపరుస్తూ వస్తున్నారు. అయితే ఓడిపోతారన్న భయంతోనే చంద్రబాబు ఇలా అందరిపై ఆరోపణలు చేస్తున్నారని అటు రాజకీయ నేతలు, ప్రతిపక్ష వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇదే సమయంలో మమత సైతం చంద్రబాబు విషయంలో ప్లేటు ఫిరాయించినట్లు తెలుస్తోంది. నిన్నమొన్నటివరకు బాబుకు మద్దతుగా నిలిచిన మమత ఎన్నికలసమయంలో సైతం టీడీపీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. అయితే ఇప్పుడు మాత్రం ఆమె కొత్తరాగం అందుకున్నారన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. అవసరమైతే చంద్రబాబుకు దూరం అయ్యేందుకు తాను సిద్దమని సమాచారం.

మరోవైపు మమత జగన్‌తో చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును సన్నిహితంగా ఉంటూనే జగన్‌ను కూడా తెలివిగా తనవైపునకు తిప్పుకునేందుకు ఆమె పావులు కదుపుతున్నారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా ఓ ఇంటర్య్యూలో మమత... కేంద్రంలో నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. దీంతో ఎలాంటి ప్రభుత్వం వచ్చినా కూడా కేంద్రంపై పెత్తనం చేసేందుకు ఏపీ,తెలంగాణ,ఒడిశా వంటి రాష్ట్రాలతో మంచి సంబాధలు కొనసాగించాలని మమత డిసైడ్ అయినట్లు సమాచారం.


First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...