• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • WILL AP MINISTER SOMIREDDY CHANDRAMOHAN REDDY WIN FROM SARVEPALLY AFTER 4 DEFEATS AK

ఏపీ మంత్రి ఈ సారైనా గెలుస్తారా ? ఓడితే కెరీర్ ముగిసినట్టేనా ?

ఏపీ మంత్రి ఈ సారైనా గెలుస్తారా ? ఓడితే కెరీర్ ముగిసినట్టేనా ?

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(File)

1999 తరువాత ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయాన్ని నమోదు చేయలేకపోయిన ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి... ఐదోసారి కచ్చితంగా గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారు.

  • Share this:
    రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అయితే వరుసగా నాలుగుసార్లు ఓటమి పాలవ్వడం ఎవరికైనా ఇబ్బందే. అయితే తనదైన మాట తీరుతో ఓడినా టీడీపీలో చక్రం తిప్పుతున్న నాయకుడు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 1999 తరువాత ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయాన్ని నమోదు చేయలేకపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి... ఐదోసారి కచ్చితంగా గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారు. సర్వేపల్లి నుంచి 2004, 2009, 2014లో పోటీ చేసి ఓడిన సోమిరెడ్డి, 2012 ఉప ఎన్నికల్లో కోవూరు నుంచి పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. అయితే అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకుని చంద్రబాబు కేబినెట్‌లో వ్యవసాయశాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి... ఈ సారి సర్వేపల్లి నుంచి కచ్చితంగా గెలవాలని పట్టుదలగా ఉన్నారు.

    గత ఎన్నికల్లో ఆయనను ఓడించిన కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి సోమిరెడ్డితో తలపడబోతున్నారు. ఈ సారి ఎలాగైనా గెలవాల్సిందే అని భావిస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి... ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి మరీ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నారు. దీంతో ఈ సారి ఆయన ఓడిపోతే ఆయన పొలిటికల్ కెరీర్ దాదాపుగా క్లోజ్ అయినట్టే అనే ఊహాగానాలు జిల్లా రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు సోమిరెడ్డిని మరోసారి ఓడించాలని భావిస్తున్న సర్వేపల్లి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న సోమిరెడ్డి అనుకున్నది సాధిస్తారా లేదా తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.
    First published:

    అగ్ర కథనాలు