ఆ వైసీపీ నేతను ఈసారైనా జగన్ కరుణిస్తారా... ఆ పదవి దక్కేనా ?

ఎన్నికల ప్రచార సమయంలో చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ స్థానంతో పాటు మంత్రి పదవి ఆఫర్ చేశారు వైఎస్ జగన్.

news18-telugu
Updated: August 6, 2019, 6:53 PM IST
ఆ వైసీపీ నేతను ఈసారైనా జగన్ కరుణిస్తారా... ఆ పదవి దక్కేనా ?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (File)
  • Share this:
ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీలో బలాబలాలను బట్టి చూస్తే... ఈ మూడు స్థానాలు వైసీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయన్నది సుస్పష్టం. ఇంతవరకు బాగానే ఉన్నా... ఈ మూడు స్థానాలు వైసీపీలో ఎవరికి దక్కుతాయన్న దానిపై ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యేగా కాకపోయినా జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణకు ఒక స్థానం దక్కనుంది. మంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తి ఆరు నెలల్లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉండటంతో...ఆయనకు ఈ మూడు స్థానాల్లో ఒక సీటు ఖాయమైనట్టే.

ఇక బాలకృష్ణ చేతిలో ఓడిపోయిన మహ్మద్ ఇక్బాల్‌కు మరో సీటు దక్కొచ్చనే టాక్ వినిపిస్తోంది. గుంటూరులో జరిగిన ఇఫ్తార్ విందు సందర్భంగా ఇక్బాల్‌ను ఎమ్మెల్సీ చేస్తామని సీఎం జగన్ హామీ కూడా ఇచ్చారు. దీంతో ఆ మూడో సీటు ఎవరికి దక్కుతుందనే అంశంపై చర్చ మొదలైంది. ఈ మూడో సీటు కోసం పలువురు పోటీ పడుతున్నారు. అయితే ఎన్నికల ప్రచార సమయంలో చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ స్థానంతో పాటు మంత్రి పదవి ఆఫర్ చేశారు జగన్.

Mlc seat to marri rajashekar,jagan minister offer to marri rajashekar,ap cm ys jagan mohan reddy,ap mlc elections,ys jagan,ap politics,ap news,మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ సీటు,మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి,ఏపీ సీఎం వైఎస్ జగన్,ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు,వైఎస్ జగన్,ఏపీ రాజకీయాలు
మర్రి రాజశేఖర్ (ఫైల్ ఫోటో)


అయితే మంత్రిగా మర్రి రాజశేఖర్‌కు ఛాన్స్ దక్కలేదు. దీంతో ఆయనకు సీఎం జగన్ ఈ సారి ఎమ్మెల్సీగా అయిన అవకాశం ఇస్తారా లేక మళ్లీ వెయిటింగ్‌లో పెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎమ్మెల్సీ స్థానాల కోసం వైసీపీలో పోటీ ఎక్కువగానే ఉంది. కర్నూలు జిల్లాకు చెందిన చల్లా రామకృష్ణారెడ్డితో పాటు విశాఖ జిల్లాకు చెందిన పలువురు నేతలు ఎమ్మెల్సీ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కాలేకపోయిన మర్రి రాజశేఖర్‌ను జగన్ కరుణిస్తారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

First published: August 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>