జీహెచ్ంఎసీ ఎన్నికలతో జగన్‌కు లబ్ధి జరగనుందా?

తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరనుందా?

news18-telugu
Updated: October 8, 2020, 7:49 PM IST
జీహెచ్ంఎసీ ఎన్నికలతో జగన్‌కు లబ్ధి జరగనుందా?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
  • Share this:
తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరనుందా. వైసీపీ పోటీ చేసినా, పోటీ చేయకపోయినా కూడా ఏపీ సీఎం జగన్‌కు మాత్రం లాభం జరగనుందా?. అది ఎలాగంటే, తెలంగాణలోని జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహణకు ఆ రాష్ట్ర ఎస్ఈసీ సమాయత్తం అవుతోంది. రాష్ట్రంలో మెజారిటీ పార్టీలు కోరిన మేరకు ఈవీఎం మెషిన్ల ద్వారా కాకుండా బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం భారీగా బ్యాలెట్ బాక్సులను సేకరించడం మొదలు పెట్టింది. గతంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ నుంచి 30వేల బ్యాలెట్ బాక్సులను పంపించారు. అయితే, కరోనా నేపథ్యంలో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో విన్న విబేధాలతో ఇప్పుడప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ సర్కారు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌డంతో జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు వినియోగించడానికి తిరిగి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి 30వేల బ్యాలెట్ బాక్సుల‌ను తెప్పిస్తోంది. గురువారం నాటికి 17,366 బ్యాలెట్ బాక్స్‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 7 జిల్లాల నుంచి అందాయి. మిగిలిన 12,366 బ్యాలెట్ బాక్సుల‌ను కూడా ఏపిలోని వివిధ జిల్లాల నుంచి తెప్పిస్తున్న‌ారు. బ్యాలెట్ బాక్స్‌ల‌ను విక్ట‌రీ ప్లే గ్రౌండ్‌లోని గ‌దుల‌లో భ‌ద్ర‌ప‌రుస్తున్న‌ారు. ఇప్ప‌టి వ‌ర‌కు విశాఖప‌ట్నం జిల్లా నుంచి 7,111, చిత్తూరు జిల్లా నుంచి 5,458, అనంత‌పురం నుంచి 357, ప్ర‌కాశం నుంచి 841, నెల్లూరు నుంచి 1300, తూర్పుగోదావ‌రి నుంచి 449, క‌డ‌ప నుంచి 1850 బ్యాలెట్ బాక్స్‌లు వచ్చాయి.

GHMC Elections 2020, GHMC Elections date, GHMC Election news, Ghmc elections ballot papers, ghmc elections ballot boxes, జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020, జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ, జీహెచ్ఎంసీ ఎన్నికల ావర్తలు, జీహెచ్ఎంసీ ఎణ్నికలు పేపర్ బ్యాలెట్,
ఏపీ నుంచి వెనక్కి రప్పించిన బ్యాలెట్ బాక్సులు


ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే బ్యాలెట్ బాక్సులు కావాలి. ప్రస్తుతం ఏపీ వద్ద సరిపడినంత బ్యాలెట్ బాక్సులు లేవు. సరిపడినంత బ్యాలెట్ బాక్సులు కావాలంటే తెలంగాణలోని జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆగాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేం. మొదట షెడ్యూల్ విడుదల చేయాలి. ఆ తర్వాత నోటిఫికేషన్, నామినేషన్లు, ఎన్నికల కౌంటింగ్ మొత్త ప్రక్రియ పూర్తయ్యే వరకు కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ నెల కాబట్టి, నవంబర్ పూర్తయ్యే వరకు బ్యాలెట్ బాక్సులు అందుబాటులోకి రాకపోవచ్చు.

Nimmagadda Ramesh kumar news, Nimmagadda Ramesh kumar as ap sec, governor order on Nimmagadda Ramesh kumar, ap news, cm ys jagan mohan reddy, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ న్యూస్, ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఏపీ న్యూస్
నిమ్మగడ్డ, వైఎస్ జగన్


ఒకవేళ నవంబర్ తర్వాత ఎన్నికలు నిర్వహించాలంటే అప్పటికి రాష్ట్రంలో (ఏపీ) కరోనా పరిస్థితి ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. అసలు కరోనా వల్లే నిమ్మగడ్డకు, జగన్‌కు మధ్య వార్ మొదలైంది. మళ్లీ కరోనా తగ్గకుండా ఎన్నికలకు వెళ్లే సాహసం ఎస్ఈసీ చేయదు. మరోవైపు కరోనా రెండో దశ కూడా ప్రారంభమైందనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. సాక్షాత్తూ ఏపీ వైసీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రెండోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు గతంలో కరోనా వచ్చి తగ్గింది. తాజాగా, మరోసారి కరోనా వచ్చింది. ఈ సమీకరణాలన్నీ లెక్కిస్తే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగకపోవచ్చు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే మూడ్‌లో లేని జగన్‌కు జీహెచ్ఎంసీ ఎన్నికల రూపంలో ఓరకంగా లాభం జరగనుంది. అయితే, పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే తెలంగాణ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా బ్యాలెట్ బాక్సులను తెప్పించుకునే వెసులుబాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు కూడా ఉంటుంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 8, 2020, 7:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading