మోదీ మదిలో కేబినెట్ విస్తరణ యోచన... ఏపీకి ఛాన్స్ దక్కేనా ?

వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లడం, ఏపీలో బీజేపీతో ఏ పార్టీ ఎన్నికల పొత్తు పెట్టుకోకపోవడం వంటి అంశాలు కేంద్ర కేబినెట్‌లో ఏపీ నేతలకు చోటు దక్కకపోవడానికి కారణమయ్యాయి.

news18-telugu
Updated: October 18, 2019, 6:51 PM IST
మోదీ మదిలో కేబినెట్ విస్తరణ యోచన... ఏపీకి ఛాన్స్ దక్కేనా ?
మోదీ, ఏపీ ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 18, 2019, 6:51 PM IST
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తరువాత కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజకీయ అవసరాలు, కొందరు మంత్రుల పనిభారాన్ని తగ్గించాల్సి ఉండడం వంటివి అంశాల కారణంగా ప్రధాని నరేంద్రమోదీ త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది బిహార్‌, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో... అక్కడి ఎంపీలకు ఈ సారి కేబినెట్‌లో అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. బిహార్‌లో మిత్రపక్షంగా ఉన్న జేడీయూకి ఈ సారి మంత్రివర్గ విస్తరణలో చోటు ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూతో కలిసే పోటీ చేస్తామని బీజేపీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేయడంతో... ఆ పార్టీకి చెందిన నేతలకు కేబినెట్‌లో చోటు దక్కొచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా... కేంద్ర కేబినెట్‌లో ప్రస్తుతం ప్రాతినిథ్యం లేని ఏపీ ఎంపీలకు విస్తరణలో ఛాన్స్ దక్కుతుందా అనే చర్చ కూడా మొదలైంది. టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం కావడంతో... వారిలో ఎవరికైనా బీజేపీ నాయకత్వం ఛాన్స్ ఇస్తుందా ? అనే ప్రచారం కూడా జరుగుతోంది.

గతంలో వెంకయ్యనాయుడుతో పాటు టీడీపీ ఎంపీలు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. అయితే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లడం, ఏపీలో బీజేపీతో ఏ పార్టీ ఎన్నికల పొత్తు పెట్టుకోకపోవడం వంటి అంశాలు కేంద్ర కేబినెట్‌లో ఏపీ నేతలకు చోటు దక్కకపోవడానికి కారణమయ్యాయి. అయితే ఏదో రకంగా ఏపీకి కేబినెట్‌లో ప్రాతినిథ్యం కల్పించాలని మోదీ, షా భావిస్తే... రాష్ట్రానికి చెందిన ఎవరో ఒక నేతకు అమాత్య యోగం దక్కొచ్చని పలువురు బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు.First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...