బీజేపీ, వైసీపీ మధ్య దూరం రోజురోజుకు పెరుగుతుంది. ఇటీవలే చోటు చేసుకుంటున్న పరిణామాలే దీనికి ఉదాహరణ. పలు సార్లు ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి .. కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. అయితే దీనిపై పలు ఆసక్తికర వార్తలు వినిపించాయి. కావాలనే షా జగన్‌కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్న వాదన తెరపైకి వచ్చింది. అయితే దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు జగన్ హస్తిన బాట పట్టారని చెబుతున్నా... ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వెనుక సొంత అజెండా ఉందన్న సమాచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో షా తీరుతో విసిగిపోయిన జగన్.. సరికొత్త నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు చర్చించకుంటున్నాయి.
తాజాగా ఇంటలిజెన్స్ చీఫ్‌గా మనీష్ కుమార్ సిన్హాను జగన్ నియమించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయన.. కావాలనే షాను రెచ్చగొడుతున్నాడని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సిన్హా ఒకప్పుడు అమిత్ షా పై పలు కేసుల నమోదులో కీకల పాత్ర పోషించారు. అమిత్ షా హోంమంత్రి కాకముందు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. వాటిలో కొన్న ికేసులు నమోదుకు నాుడ వచారణ అధికారిగా ఉన్న మనీష్ కుమార్ సిన్హా కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఏపీ ఇంటెలిజనెన్స్ఇన్ ఛీఫ్‌గా రావడం అసలు చర్చకు దారితీస్తోంది. అయితే ఇందుకు జగన్ పట్ల షా వైఖరే కారణమని తెలుస్తోంది. జగన్‌కు అపాయింట్ మెంట్ ఇవ్వని షా... మరోవైపు వైసీపీ ఎంపీ రఘురామ కృష్నం రాజుకు మాత్రం ఈజీగా కలిసే ఛాన్స్ ఇస్తున్నారు. దీంతో అమిత్ షా తీరుపై సీఎం జగన్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. అందుకే ఒకప్పుడు షా విషయంలో కొరకరాని కొయ్యిగా ఉన్న పోలీస్ అధికారిని ఏపీకి నియమించారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే మరోవైపు మాత్రం జగన్ తీసుకున్న ఈ డెసిషన్‌తో ఆ పార్టీలో సైతం కాస్త కలవరం మొదలయ్యింది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయనకు వచ్చే లాభం ఏంటి ? అది పక్కన పెడితే.. కేంద్రం నుంచి మరిన్ని కష్టాలు కొనితెచ్చుకుంటున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చర్య అమిత్ షాను కవ్వించడం తప్ప మరొకటి కాదంటున్నారు. ఇది కొరివితో తలగొక్కోడమేనని వార్నింగ్ ఇస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో దూసుకువెళ్తున్న జగన్‌కు అంత అవసరం ఏంటని రాజకీయ నిపుణులు సైతం ప్రశ్నిస్తున్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:December 17, 2019, 08:42 IST