మంగళగిరి నుంచే మళ్లీ పోటీ... 2024 తరువాత చంద్రబాబే సీఎం... నారా లోకేశ్

Nara lokesh comments | రాబోయే ఐదేళ్లు పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదే అని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఓటమి చవిచూసిన మంగళగిరి నుంచే మళ్లీ పోటీ చేస్తానని లోకేశ్ స్పష్టం చేశారు.

news18-telugu
Updated: May 28, 2019, 11:46 AM IST
మంగళగిరి నుంచే మళ్లీ పోటీ... 2024 తరువాత చంద్రబాబే సీఎం... నారా లోకేశ్
నారా లోకేశ్(File)
  • Share this:
ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఏపీ మాజీమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నాలు చేశారు. రాబోయే ఐదేళ్లు పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదే అని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఓటమి చవిచూసిన మంగళగిరి నుంచే మళ్లీ పోటీ చేస్తానని లోకేశ్ స్పష్టం చేశారు. 2024లో మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఉండి ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడతానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

పార్టీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని 2024లో ఏపీ సీఎంగా చంద్రబాబు మళ్లీ ప్రమాణస్వీకారం చేస్తారని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలోఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్...ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ కట్ చేశారు. టీడీపీ ఓటమి తరువాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన లోకేశ్... పార్టీ కోసం తాను ముందుండి నడిపిస్తానని ప్రకటించడంతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

First published: May 28, 2019, 11:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading