YV Subba Reddy: వికీపీడియాలో వైవీ సుబ్బారెడ్డి ప్రొఫైల్ 95 సార్లు మారింది.. ఎందుకంటే..

Wikipedia: వికీపీడియాలో ఒక్క రోజే 95 సార్లు ఆయన మతాన్ని ఎడిట్ చేయడం గమనార్హం. గురువారం సాయంత్రం 7 గంటల వరకు కొందరు ఆయన క్ట్రిస్టియన్ అని, కన్‌వర్టెడ్ క్ట్రిస్టియన్ అని, కాదు.. హిందువు అని అలా ఎడిట్ చేస్తూ పోయారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 7, 2019, 11:55 AM IST
YV Subba Reddy: వికీపీడియాలో వైవీ సుబ్బారెడ్డి ప్రొఫైల్ 95 సార్లు మారింది.. ఎందుకంటే..
తిరుమలలో ఇప్పటి వరకూ 140 కేసులు నమోదు అయ్యాయని టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
  • Share this:
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని ఖరారు చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. అయితే, సుబ్బారెడ్డి హిందువు కాదని, క్రైస్తవుడు అని, ఆయనకు టీటీడీ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ఆ పదవి హిందువులకే కేటాయించాలని కొన్ని వర్గాలు హడావుడి చేశాయి. వికీపీడియాలో ఒక్క రోజే 95 సార్లు ఆయన మతాన్ని ఎడిట్ చేయడం గమనార్హం. గురువారం సాయంత్రం 7 గంటల వరకు కొందరు ఆయన క్ట్రిస్టియన్ అని, కన్‌వర్టెడ్ క్ట్రిస్టియన్ అని, కాదు.. హిందువు అని అలా ఎడిట్ చేస్తూ పోయారు. సోషల్ మీడియాలో కూడా ఆయన ట్రెండ్ అయ్యారు. కొందరైతే, ఏకంగా చర్చి వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్‌కు పనిచేశారని లింకును షేర్ చేశారు.

జగన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, తిరుమల, టీటీడీ, YS Jaganmohan reddy,YS Jagan,AP CM YS Jagan,YV Subbareddy,Subbareddy ongole Mp,Prakasham politics,where is YV Subbareddy,subbareddy and jagan relation,YV Subbareddy future,YV Subbareddy rajya sabha mp,YV subbareddy as ttd chariman,ttd chairman,ttd board cance,ttd chairman race,ysrcp ttd,జగన్ మోహన్ రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి,వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ ఎంపీ,వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్,వైవీ సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని,జగన్ వైవీ సుబ్బారెడ్డి,
వికీపీడియాలో ఎడిట్ చేసిన వైవీ సుబ్బారెడ్డి వివరాలు


అయితే, ఈ వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను హిందువు కాదన్న వార్తలు అవాస్తవమని.. కొందరు పనిగట్టుకుని ఇలాంటి పుకార్లు చేస్తున్నారని వాటిని నమ్మవద్దని చెప్పారు. తాను హిందువునేనని.. తిరుమల తిరుమలేశుడు మా ఇష్ట దైవం అని స్పష్టం చేశారు. సీఎం జగన్ తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానన్నారు. టీటీడీ బోర్డు చైర్మన్‌గా ఉండాలని జగన్ తనను ఆదేశించారని.. దేవుడికి సేవ చేసే భాగ్యం కలిగించిందని వెల్లడించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 7, 2019, 11:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading