Home /News /politics /

WIFE AND HUSBAND CONTESTING AS SARPANCH CANDIDATES IN ANDHRA PRADESH PANCHAYAT ELECTIONS HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: సర్పంచ్ పదవి కోసం భార్యాభర్తల పోటీ.. పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat elections) చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రచారాలు, గుర్తుల సంగతి అటుంచితే.. బంధువుల మధ్య పోటీలు ఆసక్తికి రేకెత్తిస్తున్నాయి.

    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రచారాలు, గుర్తుల సంగతి అటుంచితే.. బంధువుల మధ్య పోటీలు ఆసక్తికి రేకెత్తిస్తున్నాయి. అత్తాకోడళ్లు, అన్నాదమ్ములు, తోటికోడళ్లు, మామాఅల్లుళ్లు ఇలా బంధువల మధ్య పోరు జరుగుతోంది. ఐతే ఇక్కడ విచిత్రంగా భార్యాభర్తలు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలం ఆలూరు గ్రామ పంచాయతీలో భార్యాభర్తలు సర్పంచ్ పదవికోసం పోటీపడుతున్నారు. గ్రామంలో సోమేశ్వరస్వామి ఆలయ మాజీ ఛైర్ పర్సన్ రెడ్డి రాధిక, రెడ్డి విఠల్ ఇద్దరూ సర్పంచ్ పోటీలో నిలిచారు. వీరిలో రెడ్డి రాధిక ప్రధాన అభ్యర్థిగా పోటీ చేయగా.. ఆమె భర్త రెడ్డి విఠల్ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

    ఐతే రెడ్డి విఠల్ సకాలంలో నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోవడంతో ఆయన కూడా పోటీలో నిలిచారు. గ్రామంలో మొత్తం ఐదుగురు పోటీలో నిలవగా అందులో ఇద్దరు వీళ్లే ఉన్నారు. దీంతో మండలంలో వీరి మధ్య పోటీనే హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో రెడ్డి రాధికకు ఉంగరం గుర్తు కేటాయించిన అధికారులు విఠల్ కు బుట్ట గుర్తును కేటాయించారు. ఐతే ప్రచారంలో మాత్రం ఇద్దరూ పాల్గొంటున్నారు. విఠల్ మాత్రం తన భార్యకే ఓటు వేయాలని గ్రామస్తులను కోరుతున్నారు.

    ఇది చదవండి: 'నవరత్నాల' అమలుకు వాటిపైనే దృష్టి.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు



    మరోవైపు గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని చల్లగుండ్ల సర్పంచ్ అభ్యర్థులుగా అత్తకోడళ్లైన బత్తుల బేబీ, బత్తుల ఉమా నామినేషన్లు వేశారు. ఐతే ఇక్కడ ఎన్నిక ఏకగ్రీవం కావడం కోసం స్థానిక నేతలు ప్రయత్నాలు జరపడంతో అత్తను సర్పంచ్ చేయడం కోసం కోడలు ఉమ తన నామినేషన్ ను వెనక్కి తీసుకుంది. దీంతో అత్త బత్తుల బేబి గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    ఇది చదవండి: ఏపీలో మరోచోట మదనపల్లి తరహా ఘటన.. ఆ యువకుడ్ని నరబలి ఇచ్చారా..?



    ఇక దేవవరం గ్రామ పంచాయతీలో అత్తాకోడళ్లైన భూ లక్ష్మీ, ఆది లక్ష్మీ నామినేషన్లు దాఖలు చేశారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఐతే ఇక్కడ కోడలిని సర్పంచ్ చేయడం కోసం అత్తగారైన ఆదిలక్ష్మి తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. దీంతో కోడలు భూలక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని మాతల గ్రామంలో అత్తాకోడళ్లు పంచాయతీ ఎన్నికల్లో పోటీపడుతుంటం అందరిని దృష్టని ఆకర్షిస్తోంది. అందులో అత్తకు టీడీపీ మద్దతుగా నిలుస్తుండగా, కోడలుకు వైసీపీ మద్దతిస్తోంది. అయితే వారిద్దరు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్‌రావు కుటుంబ సభ్యులు కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. కలమట మోహనరావు సతీమణి కలమట వేణమ్మ టీడీపీ నుంచి , చిన్న కోడలు కలమట సుప్రియ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. గతంలో నాలుగు సార్లు వేణమ్మ గ్రామ సర్పంచ్‌గా గెలుపొందారు. అయితే ఈసారి కోడలే వేణమ్మపై పోటీకి నిలవడంతో.. ఎవరు సర్పంచ్ అవుతారనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం వేణమ్మ, సుప్రియలు జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, Gram Panchayat Elections, Krishna District, Local body elections

    తదుపరి వార్తలు