రోజాలో సడన్ మార్పు.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

Roja Selvamani | ఏపీ అసెంబ్లీలో టీడీపీ మీద వైసీపీ ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు. చాన్స్ దొరికినా రోజా మాత్రం మౌనంగానే ఉంటున్నారు.

news18-telugu
Updated: July 20, 2019, 7:31 PM IST
రోజాలో సడన్ మార్పు.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
వైసీపీ ఎమ్మెల్యే రోజా (ఫైల్ ఫోటో)
  • Share this:
రోజా అంటే ఓ ఫైర్ బ్రాండ్. అయితే, అది ఒకప్పుడు అని అనాలేమో. ఎందుకంటే ప్రస్తుతం ఆమె పూర్తి శాంతమూర్తిగా మారిపోయారు. అసెంబ్లీలో రోజూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య రచ్చ జరుగుతున్నా.. అందులో రోజా ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. పెద్దగా పట్టించుకోవడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె చేస్తున్న దాడిని తట్టుకోవడానికి అధికార టీడీపీ ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఓ దశలో రోజాను ఏడాది పాటు సభ నుంచి కూడా బహిష్కరించారు. దీన్ని బట్టి రోజా ఏ రేంజ్‌లో ఫైర్ అయ్యేవారో ఆలోచించుకోవచ్చు. అయితే, ప్రస్తుతం అధికారం చేతిలో ఉంది. అయినా సరే రోజా చల్లబడిపోయారు. అసెంబ్లీకి వచ్చామా? వెళ్లామా? అన్నట్టుగా ఉంటున్నారు. అయితే, రోజాలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటనే విషయం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఇక రోజానే హోంమంత్రి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, కేబినెట్‌లో ఆమెకు చోటు దక్కలేదు. ఆ తర్వాత ఏపీఐఐసీ చైర్మన్‌గా నియమించారు. అయితే, రోజాను నియమించిన చాలా తర్వాత కానీ, దానిపై అధికారికంగా జీవో రాలేదు. రోజాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామనే అభిప్రాయం ఎక్కడా కలగకూడదనే ఉద్దేశంతోనే జగన్ మోహన్ రెడ్డి ఆమె విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారనే ప్రచారం వైసీపీలో జరుగుతోంది. ఇదే అంశంపై రోజా బాధపడుతోందని చెబుతున్నారు. అందరిలో తానూ ఒకరిననే భావనతో చూస్తున్నారని, పార్టీ కోసం తను పడిన శ్రమను గుర్తించలేదనే అభిప్రాయం ఆమె మనసులో నాటుకుపోయిందని, అందుకే, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సైలెంట్‌గా ఉండిపోతున్నారని సమాచారం.

First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు