ఇరకాటంలో జగన్ ప్రభుత్వం.. నోరెత్తకపోవడానికి కారణం?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవే కేసుల మీద దుమ్మెత్తిపోసిన వైసీపీ, ఇప్పుడు మాత్రం వాటిపై ఏ మాత్రం శ్రద్ధ చూపకపోవడం రాజకీయవర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.

news18-telugu
Updated: December 7, 2019, 6:07 PM IST
ఇరకాటంలో జగన్ ప్రభుత్వం.. నోరెత్తకపోవడానికి కారణం?
ఏపీ సీఎం జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొన్ని కేసులు గుదిబండలా మారాయి. అవి ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణల కంటే కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన మీద విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి దాడి జరిగింది. ఈ కేసు వెనుక అదృశ్య హస్తం ఉందని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. దీని మీద పెద్ద ఎత్తున నిరసనలు కూడా వెల్లువెత్తాయి. మరోవైపు ఎన్నికలకు కొన్నాళ్ల ముందు వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య జరిగింది. అత్యంత దారుణంగా ఆయన హత్యకు గురయ్యారు. దీని మీద కూడా పెద్ద రాజకీయ దుమారం రేగింది. అప్పుడు కూడా వైసీపీ నేతలు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మీద తమకు నమ్మకం లేదన్నారు.

ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి. పదవి చేపట్టి ఆరు నెలల పాలన కూడా పూర్తి చేసుకున్నారు. అయితే, ఈ రెండు సంచలన కేసులు మాత్రం ముందుకు సాగలేదు. ఆ రెండు కేసుల మీద జగన్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందనే ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో వైఎస్ వివేకా హత్య కేసులో తాజాగా పురోగతి కనిపించింది. చాలా రోజుల తర్వాత సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి నోటీస్ జారీ చేశారు. అసలు జగన్ మీద జరిగిన కోడి కత్తి దాడి కేసు ఏమయిందనే విషయం కూడా ప్రజలకు తెలీదు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవే కేసుల మీద దుమ్మెత్తిపోసిన వైసీపీ, ఇప్పుడు మాత్రం వాటిపై ఏ మాత్రం శ్రద్ధ చూపకపోవడం రాజకీయవర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఇలా ఎందుకు చేస్తున్నారనే ప్రతిపక్షాల ప్రశ్నలకు వైసీపీ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది.
First published: December 7, 2019, 6:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading