పనిచేయని టీడీపీ వెబ్‌సైట్, సేవా మిత్ర యాప్.... వైసీపీ నేతల కొత్త అనుమానాలు

డేటా చోరీ కేసులో డైరెక్టుగా దొరికిపోయిన చంద్రబాబునాయుడు ఇందులో ప్రధాన సాక్ష్యం అయిన టీడీపీ వెబ్‌సైట్‌ను షట్ డౌన్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: March 7, 2019, 7:51 PM IST
పనిచేయని టీడీపీ వెబ్‌సైట్, సేవా మిత్ర యాప్.... వైసీపీ నేతల కొత్త అనుమానాలు
పనిచేయని టీడీపీ వెబ్‌సైట్, సేవామిత్ర యాప్
  • Share this:
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డేటా చోరీ కేసులో వైసీపీ నేతలు కొత్త సందేహాలను లేవనెత్తారు. ఈ వివాదంలో అత్యంత ముఖ్యమైన సేవామిత్ర యాప్ పనిచేయడం లేదని, అది ఎందుకు షట్ డౌన్ అయిందని ప్రశ్నించారు. అలాగే, టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌ ఎందుకు పనిచేయడం లేదని సందేహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో చంద్రబాబునాయుడు అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ అన్నారు. డేటా చోరీ కేసులో డైరెక్టుగా దొరికిపోయిన చంద్రబాబునాయుడు ఇందులో ప్రధాన సాక్ష్యం అయిన టీడీపీ వెబ్‌సైట్‌ను షట్ డౌన్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే, పార్టీ వర్గాల ద్వారా పనిచేస్తున్న సేవామిత్ర యాప్‌ను కూడా షట్ డౌన్ చేశారని ఆరోపించారు.

25 ప్రభుత్వ శాఖల్లోని సమాచారాన్ని తీసుకోవడానికి బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీకి అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 75 రిలీజ్ చేసిందని ఆరోపించారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా మరో సాక్ష్యం దొరికిందని వైసీపీ నేతలు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రెస్ మీట్ చూస్తే తప్పు చేసిన వ్యక్తి దొరికిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తోందని, తన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసిపోయిందన్నారు.
First published: March 7, 2019, 7:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading