హోమ్ /వార్తలు /రాజకీయం /

బీజేపీవైపు చంద్రబాబు చూపు...? కథ మళ్లీ మొదటికొచ్చిందా..?

బీజేపీవైపు చంద్రబాబు చూపు...? కథ మళ్లీ మొదటికొచ్చిందా..?

చంద్రబాబు, నరేంద్రమోదీ

చంద్రబాబు, నరేంద్రమోదీ

Chandrababu : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్న రెగ్యులర్ డైలాగ్‌ని చంద్రబాబు మళ్లీ నెత్తికెత్తుకుంటున్నారా... అమరావతిలో ఏం జరుగుతోంది?

    ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును... యూటర్న్ సీఎం అని అనేకసార్లు పిలిచింది వైసీపీ. ఆయన ఏ విషయంలోనూ నిబద్ధతతో ఉండరనీ, ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చేసుకుంటారనీ వైసీపీ ఆరోపిస్తూనే ఉంది. తాజా ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం, అదే సమయంలో బీజేపీ బంపర్ మెజార్టీతో గెలవడంతో... చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మళ్లీ NDAలో కలవకపోయినా, బీజేపీతో సత్సంబంధాలు పెచుకునేందుకు పావులు కదుపుతున్నారని తెలిసింది. ఇందుకోసం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మద్దతు కోరుతున్నారనీ, ఇందుకోసం విజయవాడ ఎంపీ కేసినేని నానీతో కథ నడిపిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


    కేసినేని నాని, వెంకయ్యనాయుడికీ మధ్య అరగంటకుపైగా చర్చ జరిగింది. ఆ సమయంలో చంద్రబాబుకి ఫోన్ చేసిన కేసినేని నాని... వెంకయ్యనాయుడితో మాట్లాడించినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. 2014లో వెంకయ్యనాయుడి వల్లే, బీజేపీ-టీడీపీ జట్టుగా ఏపీ ఎన్నికల్లో పాల్గొన్నాయి. అప్పటికే ఓసారి బీజేపీతో కలిసి... తిరిగి దూరమై... మళ్లీ కలిసేది లేదన్న చంద్రబాబు... 2014లో మళ్లీ కలవడంపై విమర్శలొచ్చాయి. కానీ అవేవీ చంద్రబాబు పట్టించుకోలేదు. ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో అటు బీజేపీ, ఇటు టీడీపీ ఖుషీ అయ్యాయి. NDAలో కలిసి నాలుగేళ్లు కొనసాగాయి. ఐదేళ్ల తర్వాత 2019లో వేటికవే పోటీ చెయ్యగా, బీజేపీ దూసుకెళ్తే, చంద్రబాబు పార్టీ టీడీపీ అట్టర్ ఫ్లాపైంది.


    ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామని బీజేపీ చెప్పగా... సరేనన్న చంద్రబాబు... ఆ తర్వాత... ప్రతిపక్షాలు కార్నర్ చేసేటప్పటికి... మాట మార్చారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందనంటూ... NDAకి గుడ్ బై చెప్పారు. ఇక ఎన్నికల్లో నరేంద్ర మోదీని ఓ రేంజ్‌లో తిట్టి పోశారు. గుజరాత్‌లో మోదీ హింసాకాండకు పాల్పడ్డారని కూడా విమర్శించారు. అలా కాంగ్రెస్‌కి దగ్గరయ్యారు చంద్రబాబు. తీరా ఎన్నికల్లో ఓటమి చెందేసరికి... తిరిగి ఆయన బీజేపీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.


    వైసీపీకి చెక్ పెట్టేందుకే : తాము అధికారంలోకి వస్తే, చంద్రబాబుపై కేసుల్ని తిరగదోడతాం అని వైసీపీ నేతలు ఇదివరకు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత... లెక్కలన్నీ తేల్చడానికి సిద్ధమవుతున్నారు. అదే జరిగితే, తనకు ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తున్న చంద్రబాబు... జగన్‌ను కంట్రోల్ చెయ్యడానికి బీజేపీ సాయం కోరబోతున్నట్లు తెలిసింది. జగన్‌పై కేసులు పెండింగ్‌లో ఉన్నందువల్ల, బీజేపీ ఆయన్ని కంట్రోల్ చెయ్యగలదనీ, తద్వారా తనకు సమస్యలు రాకుండా చేసుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఐతే, బీజేపీని అనరాని మాటలు అని, ఇప్పుడు తిరిగి అదే పార్టీతో జట్టు ఎలా కడతారని ప్రశ్నిస్తే... రాజకీయాల్లో శాశ్వత శత్రువులూ, శాశ్వత మిత్రులూ ఉండరన్న రొటీన్ డైలాగ్ అటు నుంచీ వస్తే, మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.


     


    ఇవి కూడా చదవండి :

    ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకతలేంటి..? దేశ ప్రజలకు ఎందుకు నచ్చారు..?


    ఏపీ సీఎం జగన్ పొదుపు మంత్రం... అసలు కారణం చెప్పిన రోజా...


    నవరత్నాలపై జగన్ తొలి సంతకం...? ఇవాళ్టి నుంచే అమలు...


    రెండోసారి మోదీ ప్రమాణస్వీకారం... ప్రత్యేకతలు ఇవీ...

    First published:

    Tags: Andhra Pradesh, Bjp, Bjp-tdp, Chandrababu naidu, NDA, Tdp, Ys jagan mohan reddy