చంద్రబాబు అసెంబ్లీకి రాకపోవడంపై విమర్శలు... 2004 ఎఫెక్టే కారణమా?

2004లో శాసన మండలి వేస్ట్ అన్న చంద్రబాబు... ఇప్పుడు అదే శాసన మండలి కావాలంటున్నారు. ఆ క్రమంలో టీడీపీని వైసీపీ ఇరకాటంలోకి నెడుతుందనే ఉద్దేశంతోనే అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారా?

news18-telugu
Updated: January 28, 2020, 7:37 AM IST
చంద్రబాబు అసెంబ్లీకి రాకపోవడంపై విమర్శలు... 2004 ఎఫెక్టే కారణమా?
చంద్రబాబు, వైఎస్ జగన్
  • Share this:
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక... వైసీపీ అధినేత అయిన జగన్... చాలాసార్లు అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు. అసెంబ్లీకి వెళ్లడం కంటే... పాదయాత్రగా ప్రజల దగ్గరకు వెళ్లడం బెటరన్నారు. అప్పట్లో వైసీపీ తీరును తప్పుపట్టిన చంద్రబాబు... అసెంబ్లీకి ప్రతిపక్షం రాకపోవడం రాజ్యాంగ విరుద్ధమనీ... ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తున్నారనీ మండిపడ్డారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక... చంద్రబాబు ప్రతిపక్షంగా ఉంటూ... ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వీలయ్యే అసెంబ్లీకి వెళ్లకుండా బాయ్‌కాట్ చెయ్యడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా నడుచుకోవట్లేదనీ... అందుకే తాము బాయ్‌కాట్ చేశామని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ మాత్రం... 2004లో ఇదే చంద్రబాబు... శాసన మండలి వేస్ట్ అని అసెంబ్లీలో ప్రకటించి... ఇప్పుడు ఇదే చంద్రబాబు... శాసన మండలి కావాలని అంటున్నారనీ... ఇలా మరోసారి తన ద్వంద్వ వైఖరిని చాటుకున్నారని మండిపడుతోంది. ద్వంద్వ వైఖరిపై తాము నిలదీస్తామన్న భయంతోనే చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టారనీ, తనతోపాటూ... తన పార్టీ సభ్యులందర్నీ కూడా రాకుండా చేశారని ఆరోపిస్తోంది.

రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారా లేదా అన్నది పక్కనపెడితే... అసలు మండలిని రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదని కొందరు అంటున్నారు. కీలకమైన బిల్లుల్ని కాస్త ఎక్కువ సేపు చర్చించే అవకాశం మండలిలో ఉంటుందనీ... అందువల్ల మండలి తప్పనిసరిగా ఉండాలని వారు అంటున్నారు. కొంతమంది మాత్రం మండలి ఉన్నా, లేకపోయినా పెద్దగా ఒరిగేది ఏమీ లేదని అంటున్నారు. ఇలా రెండు రకాల వాదనలూ తెరపైకి వస్తున్నాయి. ఎవరి వాదనను వారు గట్టిగానే వినిపిస్తున్నారు.

ఐతే... మండలిపై చంద్రబాబు ఎలాగైతే... 2004లో ఒకలా... ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నా్రో... వైసీపీ కూడా డబుల్ స్టాండర్ట్స్ మెయింటేన్ చేస్తోందని కొందరు అంటున్నారు. అప్పట్లో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి... స్వయంగా మండలి కావాలని కోరుకున్నప్పుడు... ఆయన కొడుకైన జగన్... మండలిని వద్దనడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వృథా ఖర్చులతో పోల్చితే మండలికి ఏడాదికి అయ్యే రూ.60 కోట్లు పెద్ద మేటర్ కాదన్నది వారి వాదన. అంతే కాదు... మేధావులూ, చదువుకున్నవారూ... అసెంబ్లీలోనే ఉన్నారు కాబట్టి... మండలి అవసరం లేదని సీఎం జగన్ అనడాన్ని కూడా తప్పుపడుతున్నారు. మండలిలో పెద్దల్ని జగన్ అగౌరవ పరిచారని అంటున్నారు.

ఇలా మండలి అంశంపై ఏపీ రాజకీయాల్లో చర్చలు, వాదనలూ కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం పట్టుదలతో మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో అమోదించేసుకుంది. కేంద్రంతో కూడా ఆమోదింపజేసుకోగలిగితే... అప్పుడు ప్రభుత్వ పంతం నెగ్గినట్లవుతుంది. అదే కేంద్రం చాలా తీర్మానాల్ని పక్కన పెట్టినట్లే... దీన్ని కూడా పక్కనపెడితే... అది వైసీపీకి ఇబ్బంది కలిగిస్తుంది. మొత్తంగా చూస్తే... రాజధాని తరలింపు అంశం కంటే... మండలి దుమారం ప్రస్తుతం కాకరేపుతోంది. మండలి అంశం తేలితే తప్ప... రాజధానిపై ప్రభుత్వం ముందడుగు వేసే పరిస్థితి లేకపోవడమే దీనికి కారణం.Video: జనాలపై పంజా విసిరిన పులి.. ముగ్గురికి గాయాలు

Published by: Krishna Kumar N
First published: January 28, 2020, 7:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading