WHY STALIN REFUSED KCR FEDERAL FRONT PROPOSAL IS CHANDRABABU NAIDU INVOLVES MS
స్టాలిన్‌తో భేటీ.. కేసీఆర్‌కు సీన్ అర్థమైందా..? చక్రం తిప్పింది చంద్రబాబేనా..?
చంద్రబాబు, కేసీఆర్ (File)
కేసీఆర్ డీఎంకె అధినేత స్టాలిన్‌తో భేటీ కావడం.. ఆయన వైపు నుంచి ప్రతికూల స్పందన రావడంతో కేసీఆర్‌కు షాక్ తగిలినట్టయింది. అంతేకాదు, నిన్న కేసీఆర్‌తో భేటీలో పాల్గొన్న డీఎంకె నేత దొరైమురుగన్ నేడు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కంటే చంద్రబాబు సీనియర్ అనేది నిర్వివాద అంశం. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అప్పటినుంచి జాతీయ స్థాయిలో ఆయనకు చాలానే పరిచయాలు ఏర్పడ్డాయి. అదే అనుభవంతో మరోసారి తృతీయ కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో ప్రస్తుతం చంద్రబాబు ఉన్నారు. మరోవైపు ఆయన ప్రత్యర్థి, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మరో ప్రత్యామ్నాయ కూటమికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరు చంద్రుళ్లలో ఢిల్లీ రాజకీయంలో నెగ్గుకొచ్చేదెవరు అన్న చర్చ జరుగుతోంది.
తాజాగా కేసీఆర్ డీఎంకె అధినేత స్టాలిన్‌తో భేటీ కావడం.. ఆయన వైపు నుంచి ప్రతికూల స్పందన రావడంతో కేసీఆర్‌కు షాక్ తగిలినట్టయింది. అంతేకాదు, నిన్న కేసీఆర్‌తో భేటీలో పాల్గొన్న డీఎంకె నేత దొరైమురుగన్ నేడు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం, తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరు చర్చించినట్టు తెలుస్తోంది.
కేసీఆర్ స్వయంగా వెళ్లి కలిసినా ఆయన ప్రతిపాదనకు నో చెప్పిన స్టాలిన్.. చంద్రబాబు వద్దకు మాత్రం తమ మనిషిని పంపించి చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్ని బట్టి చూస్తే జాతీయ స్థాయిలో కేసీఆర్ కంటే చంద్రబాబు పైనే ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ నమ్మకం ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఇదివరకు కేసీఆర్ కలిసిన మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, నవీన్ పట్నాయక్లలో ఎవరి వద్ద నుంచి ఆయనకు స్పష్టమైన హామీ లభించలేదు. అదే సమయంలో వారంతా చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.
అప్పుడైనా.. ఇప్పుడైనా.. ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పిందేమి లేదు అని గతంలో వ్యాఖ్యానించిన కేసీఆర్‌కు ఇప్పుడు పరిస్థితులు మాత్రం కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయంటున్నారు. చంద్రబాబు చక్రం తిప్పడం వల్లే.. కేసీఆర్‌తో కలిసిరావడానికి ఏ ప్రాంతీయ పార్టీ కూడా సుముఖంగా లేదని చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో విషయాన్ని కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫ్రంట్‌లో కాంగ్రెస్‌ను మినహాయించడం.. చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌ను కలుపుకుని ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉండటంతో.. డీఎంకె లాంటి పార్టీలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
త్వరలోనే ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో.. ఆ తర్వాత జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ సీన్ మారిపోయే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పార్టీ గనుక బోల్తా పడితే.. జాతీయ స్థాయిలో ఇప్పుడు ఆయనకున్న ప్రాధాన్యం తగ్గిపోవచ్చు. అదే సమయంలో జగన్, కేసీఆర్ కలిసి ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగితే.. వారికి ప్రాధాన్యమివ్వడం అనివార్యం కావచ్చు. కాబట్టి ఇప్పటి భేటీలు, చర్చల ఆధారంగా భవిష్యత్ రాజకీయంపై అప్పుడే ఓ అంచనాకు రావడం కష్టమనే చెప్పాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.