Home /News /politics /

WHY PRASHANT KISHOR DID NOT JOIN CONGRESS HERE IS PRIYANKA GANDHI REVEALS HINTS SHE IS CM FACE IN UP POLLS MKS

Prashant Kishor కాంగ్రెస్‌లో చేరేవారే: అసలేం జరిగిందో చెప్పిన Priyanka Gandhi

పీకేపై ప్రియాంక కామెంట్స్

పీకేపై ప్రియాంక కామెంట్స్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని విధాలుగా సిద్ధమైనా ఆఖరు నిమిషంలో ప్రక్రియ వాయిదా పడటం తెలిసిందే. పీకే చేరికను ప్రియాంక గాంధీ వ్యతిరేకించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అసలు వాస్తవాలేంటో స్వయంగా ప్రియాంకనే వెల్లడించారు.

ఇంకా చదవండి ...
భారత రాజకీయాల్లో విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్ కిషోర్ గడిచిన 10ఏళ్లలో దాదాపు తొలిసారి ఎన్నికల వేళ ఖాళీగా ఉన్నారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఆయన ఐ-ప్యాక్ టీమ్ పనిచేస్తున్నా, పీకే మాత్రం నేరుగా జోక్యం చేసుకోవడంలేదు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ నుంచి పొలిటీషియన్ గా మారే క్రమంలో బీహార్ కు చెందిన ఆయన మొదట జనతాదళ్ యునైటెడ్(జేడీయూ)లో చేరడం, నితీశ్ కుమార్ తో విభేధాల కారణంగా పార్టీ నుంచి దాదాపు గెంటివేతకు గురికావడం, తర్వాతి కాలంలో కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ కావడం తెలిసిందే. పీకే ఆల్మోస్ట్ కాంగ్రెస్ లో చేరాల్సి ఉన్నా ఆఖరు నిమిషంలో వెనక్కి తగ్గారు. బయటి వ్యక్తులను పార్టీలో చేర్చుకుని పెద్ద పీఠ వేయడానికి ప్రియాంక గాంధీ నో చెప్పడం వల్లే పీకే చేరిక ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. కానీ అసలేం జరిగిందో స్వయంగా ప్రియాంక గాంధీనే వివరణ ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ప్రియాంక గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. సీఎం అభ్యర్థిని తానే అనే సంకేతాలూ ఇచ్చారు. యువత కోసం కాంగ్రెస్ రూపొందించిన మేనిఫెస్టోను అన్న రాహుల్ తో కలిసి శుక్రవారం విడుదల చేశారామె. ఈ సందర్భంగా మీడియా ప్రశ్నలకు సమాధానాలిస్తూ, ప్రశాంత్ కిషోర్ అంశాన్నీ ప్రస్తావించారు. కాంగ్రెస్ లోకి పీకే చేరికపై ప్రియాంక బహిరంగంగా స్పందించడం దాదాపు ఇదే తొలిసారి.

Nakkapalle: అన్నయ్యా.. ప్లీజ్ వదులన్నా.. నోట్లో గుడ్డలు కుక్కి.. తల్లి, సోదరి నగ్న వీడియోలు కావాలంటూ.. విశాఖలో దారుణంఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అలియాస్‌ పీకే గత సంవత్సరమే కాంగ్రెస్‌ పార్టీలో చేరేవారని, అయితే కొన్ని కారణాల వల్ల ఆయన కాంగ్రె్‌సలో చేరలేకపోయారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా అన్నారు. ‘కొన్ని విషయాలపై మాకు ఏకాభిప్రాయం కుదరలేదు. అందుకే కాంగ్రెస్ లో ఆయన చేరికపై చర్చలు ముందుకెళ్లలేదు’ అని తెలిపారు. అయితే బయటి వ్యక్తిని కాంగ్రెస్ లోకి తేవడంపై తాను విముఖంగా ఉన్న ట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు.

Zara Rutherford : 19 ఏళ్లకే ప్రపంచాన్ని చుట్టేసింది.. అదికూడా ఒంటరిగా చిన్న విమానంలో!


నిజానికి యూపీ అసెంబ్లీ గత(2017) ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ నాడు చెప్పిన ఐడియాలనే ఆ పార్టీ ఇప్పుడు అనుసరిస్తున్నది. ఎలాంటి శషభిషలు లేకుండా ప్రియాంకను సీఎం అభ్యర్థిగా బరిలోకి దించితే, కనీసం 2024 వరకైనా పార్టీ బలోపేతం అవుతుందని పీకే బ్లూప్రింట్ సిద్ధం చేయగా, అందుకు హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. అప్పటికి ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదుకూడా. దీంతో షీలా దీక్షిత్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్ ప్రచారానికి వెళ్లింది. కానీ తన ఐడియాలు ఇంప్లిమెంట్ కావడంలేదంటూ పీకే యూపీ నుంచి పూర్తిగా వైదొలిగి పంజాబ్ కు పరిమితమయ్యారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ గెలుపు తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ విస్తరణ చేపట్టింది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా జాతీయ నేతగా ఎదిగే సత్తా దీదీకే ఉందని పీకే ఇటీవల కామెంట్లు చేశారు.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Congress, Prashant kishor, Priyanka Gandhi, Uttar Pradesh Assembly Elections

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు