M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18 ఇద్దరూ అధికార పార్టీ నేతలే.. ఒకరు ఎమ్మెల్యే అయితే.. మరొకరు జిల్లా మంత్రి. అంతే కాదు పక్క పక్క నియోజకవర్గ నేతలు కూడా. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఒకరికి మరొకరు ఎదురుపడిన ఎవరికి వారు అన్నట్టు ఉంటున్నారని ప్రచారం ఉంది. ఆ ఇద్దరి నేతల వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కృష్ణ జిల్లా గుడివాడ ఎమ్మెల్యేగా గెలుపొంది జగన్ కేబినెట్ లో బెర్త్ ఖరారు చేసుకొని మంత్రిగా కొనసాగుతున్నారు కొడాలి నాని. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన.. ఆయన ఎదుట మహామహులు ఉన్న నాని వేసే పంచులకు సరెండర్ అవాల్సిందే. అలాంటి నేతకు సొంత జిల్లాలోనే .. అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే మధ్య పోసగడం లేదని సమాచారం. ఎన్నికల ముందు నుంచి ఎన్నికల్లో విజయం సాధించే వరకు నానితో ఆ ఎమ్మెల్యే చెట్టపట్టాలు వేసుకొని జిల్లా మొత్తం తిరిగారు. ఇప్పుడు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే టాక్ ఉంది. కొడాలి నాని నియోజకవర్గం అయిన గుడివాడకు అనుకోని ఉన్న కైకలూరు నియోజకవర్గం. మొదటి సారి దూలం నాగేశ్వర్ రావు పోటీ చేసి ఘనవిజయాన్ని సాధించారు. విజయం తరువాత కొడాలి నాని తో సత్సంబంధాలను నాగేశ్వరరావు కొనసాగించారు.. కానీ ఒక విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయని ఇరు నియోజకవర్గాల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు..
ఇద్దరి మధ్య విబేధాలకు ప్రధాన కారణం కైకలూరు నియోజకవగంలో విరివిగా దొరికే బసుక అని అంటున్నారు. ఇంటి నిర్మాణంలో ప్రధాన ఘట్టమైన బేస్మెంట్ లో ఇసుక., మట్టి వినియోగిస్తారూ. ఇక్కడ మాత్రం బుసకను ఎక్కువగా వాడుతుంటారు. కైకలూరు లోని భీమవరపాడు., తమకోళ్లు., సతీణపల్లి, వరాహ పట్నం., కలిదిండి...కోరుకోళ్లు. వెంకటాపురం., గోపాలపురం., పోతుమర్రు, కొండూరు గ్రామాల్లో భారీగా బుసక దిబ్బలు ఉన్నాయి. క్యూబిక్ మీటర్ కు 70 నుంచి 80 రూపాయల ధర పలుకుతోంది. అయితే కైకలూరులో అనుమతులు తీసుకొని కలిదిండిలో తవ్వకాలు జరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్రాక్టర్ లకు అనుమతి ఇస్తుంటే ఏకంగా పెద్ద పెద్ద ట్రక్కులకు త్రవుకొని వెళ్లిపోతున్నారట. మార్కెట్ లో ఓ ట్రక్ బుసక దాదాపు 12వేల రూపాయలకన్నా తక్కువకు దొరకడం లేదు. ట్రాక్టర్ కు వెయ్యి రూపాయలు స్థానికంగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అనుమతులు ఇచ్చిన దానికంటే ఎక్కువగా బుసక భారీగా తవేస్తున్నారు. బుసక డిమాండ్ దృష్ట్యా భారీగా త్రవకాలు చేస్తున్నారు.. ఈ విషయంలో మంత్రి., ఎమ్మెల్యే అనుచరులు పోెటీ పడుతున్నట్టు తెలుస్తోంది. దింతో అధికార పార్టీ నేతల జేబులు పూర్తిగా నిండుతున్నాయట. డిమాండ్ కు తగ్గట్లు ఎవరికి తోచినంత వారు తవ్వకాలు జరుపుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే....మంత్రి అనుచరుల మధ్య విబేధాలు తలెత్తుతున్నాయి. ఎంత తవ్వేస్తే.... అంత డబ్బులు వస్తుండటంతో వివాదం మరింత ముదిరింది అనే టాక్ పార్టీలో నడుస్తుంది. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న బుసకను మంత్రి ఎమ్మెల్యేకు అసలు నచ్చడం లేదనే చెప్పాలి. దింతో మంత్రిపై ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నారని సమాచారం.
సొంత పార్టీ అయితేనేం పక్క నియోజకవర్గం కావడంతో దిగమింగుకోలేక ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అనుచరులు... కొడాలి నాని అనుచరులు రవాణా చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఇక ఈ బుసకను ప్రభుత్వ పనులకు వినియోగిస్తున్నట్లు ఎమ్మెల్యే., మంత్రి అనుచరులు భారీగా తవ్వకాలు చేపట్టారు. నిబంధనల ప్రకారం కాకుండా అధికంగా తవ్వేశారు అనే వాదనలు ఉన్నాయి. మంత్రి అనుచరులపై సీరియస్ అయిన ఎమ్మెల్యే జిల్లా ఎస్పీకి పిర్యాదు కూడా చేశారనే విషయం బయటకు పొక్కింది. మంత్రి అనుచరుల టిప్పర్ లారీలను పట్టుకోవాలని ఎస్పీపై ఒత్తిడి కూడా తెచ్చారట. స్థానిక పోలీసులకు చెప్పి టిప్పర్లను ఆపిన సందర్భాలు, ఫైన్ వేసిన దాఖలాలు ఉన్నాయి. దింతో మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యే నాగేశ్వర్ మధ్య గ్యాప్ పెరిగిందని తెలుస్తోంది. మంత్రి అనుచరుల టిప్పర్లు కైకలూరు వైపు రావడం లేదని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇళ్లస్థలల పూడిక కోసం బుసకను యథేచ్ఛగా తరలించేస్తున్నారట. ఎమ్మెల్యే.. మంత్రి వార్ నడుమ మైనింగ్, పోలీస్ , రెవెన్యూ అధికారులు నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో కైకలూరు వైపు నాని వెళ్లాడమే లేదట. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే జిల్లాలోని మరో మంత్రి పేర్ని నాని కైకలూరులో హడావిడి చేస్తున్నారట. మత్స్య శాఖ కార్యక్రమాల్లో పాల్గొన్న ఇద్దరు నేతలు ఎవరికివారు అన్నట్టు ఉన్నారాని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ వివాదాలు కారణంగానే మంత్రి కొడాలి నాని కాస్త సైలెంట్ గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kodali Nani, Ycp