కేటీఆర్ కేబినెట్ మీటింగ్ పెట్టడం ఏంటి ?: భట్టి విక్రమార్క

ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుండా కేబినెట్ మీటింగ్ పెట్టిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ పాలనా పరమైన అనేక అనుమానాలకు తెర లేపారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

news18-telugu
Updated: August 13, 2020, 8:59 PM IST
కేటీఆర్ కేబినెట్ మీటింగ్ పెట్టడం ఏంటి ?: భట్టి విక్రమార్క
మంత్రి కేటీఆర్
  • Share this:
సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నిన్న ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగిందనే వార్తలు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో రావటం చూసి ప్రజలతో పాటు కాంగ్రెస్ నేతలకు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోందని ఆ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కరోనా మహమ్మారితో తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లాడుతోండగా ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి.. ఫుడ్ ప్రాసెసింగ్, లాజస్టిక్ పాలసీ వంటి అంశాల మీద ముఖ్యమంత్రి కాని వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో సమీక్ష జరపటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అనే అభిప్రాయం వ్యక్తమవుతోందని ఆరోపించారు.

Ktr news, kcr news, Bhatti vikramarka, telangana news, కేటీఆర్ న్యూస్, కేసీఆర్ న్యూస్, మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ న్యూస్
భట్టి విక్రమార్క (File)


సీఎం అందుబాటులో లేకపోతే ఆయన సూచించిన సీనియర్ మంత్రి లేదా ఉపముఖ్యమంత్రి రాజ్యాంగ బద్ధంగా కేబినెట్ సమావేశం నిర్వహిస్తుంటారని భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేనప్పుడు..సీఎం తనయుడు కేటీఆర్ ఏ హోదాలో, ఏ నిబంధల ప్రకారం కేబినెట్ భేటీ నిర్వాహించారో తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కనీసం కేబినెట్ భేటీకి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేని పరిస్థితుల్లో ఉన్నారా..? లేక ఆయన విదేశీ పర్యటనల్లో ఉన్నారా..? అనే విషయం మీద ప్రజల్లో చర్చ జరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుండా కేబినెట్ మీటింగ్ పెట్టిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ పాలనా పరమైన అనేక అనుమానాలకు తెర లేపారని అన్నారు. కేబినెట్ సమావేశాలు, ప్రభుత్వ పాలన అంటే కేసీఆర్, కేటీఆర్ కుటుంబ వ్యవహారం కాదని.. ఇది కోట్లాది మంది ప్రజలకు సంబంధమైన విషయమని గుర్తు చేస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: August 13, 2020, 8:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading