తెలంగాణలో జగన్‌కి పెరుగుతున్న క్రేజ్... ఇవీ కారణాలు

Telangana Politics : అప్పుడెప్పుడో చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్... నిజంగానే ఇచ్చి చూపించారు. ఐతే... ఇప్పుడు అలాంటి గిఫ్టే కేసీఆర్ తనకు తానుగా తీసుకోబోతున్నారా?

news18-telugu
Updated: October 21, 2019, 9:58 AM IST
తెలంగాణలో జగన్‌కి పెరుగుతున్న క్రేజ్... ఇవీ కారణాలు
వైఎస్ జగన్, కేసీఆర్ (File)
news18-telugu
Updated: October 21, 2019, 9:58 AM IST
Telangana Politics : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో... టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందా? ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇందుకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధాన అంశం మాత్రం ఆర్టీసీ సమ్మె. ఇది మొదలైనప్పుడు... ఆర్టీసీ ఉద్యోగులపై ఆగ్రహం చూపిన ప్రజలు... క్రమంగా ప్రభుత్వం సరిగా స్పందించట్లేదన్న ఉద్దేశంతో... ప్రభుత్వంపై ఆగ్రహం చూపిస్తున్నారు. దాదాపు 17 రోజులైనా, హైకోర్టే సూచించినా... ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంతో... సఫర్ అవుతున్నది తామే అని ప్రజలు భగ్గుమంటున్నారు. దానికి తోడు ఇవాళ్టి నుంచీ స్కూళ్లు మొదలవ్వడంతో... తమ పిల్లల్ని స్కూల్‌కి పంపేందుకు తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడటం కూడా ప్రభుత్వంపై ఆగ్రహం పెరగడానికి కారణమవుతోంది.

ఇదే సమయంలో... ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనపై తెలంగాణలో పాటిజివ్ సంకేతాలు వస్తున్నాయి. ప్రధానంగా ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు... తెలంగాణలో ఎందుకు చెయ్యలేరని తెలంగాణ ప్రజలే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు... లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పాలకులు... నష్టాల్లోకి నెట్టారన్న విమర్శలున్నాయి. దానికి తోడు... అసెంబ్లీ, సచివాలయం వంటి వాటిని మళ్లీ నిర్మిస్తామంటూ... నిధులు వృథాగా ఖర్చెందుకు చెయ్యాలనుకుంటున్నారని అడుగుతున్న ప్రజల ప్రశ్నలకు పాలకుల నుంచీ స్పష్టమైన సమాధానాలు రావట్లేదన్న విమర్శలున్నాయి. అసలు సీఎం కేసీఆర్... ప్రజలను కలవట్లేదనీ ఎప్పుడూ ప్రగతి భవన్‌కే పరిమితం అవుతున్నారనే కోణం కూడా ప్రజల్లో అసంతృప్తి పెరిగేందుకు కారణమవుతోంది. ఇదే సమయంలో... కేసీఆర్ నియంతలా మారారనీ, నిజాం పాలకుల కంటే ఘోరంగా తయారయ్యారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు కూడా ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచుతున్నాయని తెలుస్తోంది.

తెలంగాణలో సీఎం కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుంటే... ఏపీ సీఎం జగన్ గ్రాఫ్ తెలంగాణలో నానాటికీ పెరుగుతోందన్న కోణం కనిపిస్తోంది. జగన్ సీఎం అయినప్పటి నుంచీ అవినీతికి ఛాన్స్ ఉండకుండా జాగ్రత్త పడుతుండటం, ఇచ్చిన హామీలను వన్ బై వన్ నెరవేర్చుతూ... సైలెంట్‌గా పరిపాలన సాగిస్తూ పోతుండటంపై తెలంగాణ ప్రజల్లో సానుకూల అలోచనలు కలుగుతున్నాయి. దానికి తోడు ఇచ్చిన మాట ప్రకారమే ఆయన ఆర్టీసీని విలీనం చేసుకోవడం, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 10వేలు ఇవ్వడం, రైతు భరోసా కింద నిధులు కేటాయించడం ఇలాంటి అంశాలన్నీ తెలంగాణ ప్రజలను, ఏపీలో పాలన ఎలా సాగుతోందో గమనించేలా చేస్తున్నాయి. ఇదే సమయంలో తాజాగా జగన్... హోంగార్డుల జీతాన్ని 18 వేల నుంచీ 21 వేలకు పెంచడం మరో చెప్పుకోతగ్గ అంశం. ఇప్పుడు తెలంగాణలో హోంగార్డులు కూడా తమ శాలరీలు కూడా పెంచాలని కోరే అవకాశాలున్నాయి.

తెలంగాణలో రాజకీయ నేతలు కూడా జగన్ పాలన బాగుందని అంటున్నారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు... జగన్ తన తండ్రి రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుచేస్తున్నారనీ... జగన్ ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్‌తో కలవకూడదనీ, అలా కలిస్తే... జగన్‌కి ఉన్న పేరు కూడా పోతుందని సూచించారు. ఇలాంటి పరిణామాలన్నీ... తెలంగాణలో జగన్‌‍కి ఉన్న క్రేజ్‌ను పెంచుతుంటే... కేసీఆర్‌కి ఉన్న క్రేజ్‌ను తగ్గిపోతోందన్న సంకేతాలొస్తున్నాయి. అంతమాత్రాన తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని అనుకోలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ ఓసారి తన పరిస్థితినీ, పాలననూ పరిశీలించుకోవాలనీ, లేదంటే... ఆయన గ్రాఫ్‌ను ఆయనే పడేసుకుంటున్నట్లు అవుతుందని సూచిస్తున్నారు. 

Pics : కన్నడ ముద్దుగుమ్మ మేఘశ్రీ క్యూట్ ఫొటోస్Loading...
ఇవి కూడా చదవండి :

Health Tips : మిల్క్ చాకొలెట్స్ తింటే... ఎన్నో ప్రయోజనాలు

Health Tips : కోడిగుడ్డు, పొట్లకాయ... కలిపి తింటున్నారా... జాగ్రత్త

Health Tips : పండగ సీజన్‌లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి

Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు

First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...