జేడీ లక్ష్మీనారాయణకు పవన్ కళ్యాన్ షాక్...

ఇటీవల రెండు కమిటీలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. వాటిలో జేడీ లక్ష్మీనారాయణకు చోటు దక్కలేదు.

news18-telugu
Updated: July 27, 2019, 8:11 PM IST
జేడీ లక్ష్మీనారాయణకు పవన్ కళ్యాన్ షాక్...
పవన్ కళ్యాణ్, జేడీ లక్ష్మీనారాయణ
  • Share this:
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జనసేనను వీడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన అభ్యర్థిగా ఆయన విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన జనసేనకు కాస్తా దూరంగానే ఉంటున్నారు. పవన్ కల్యాణ్ తో పాటు కనిపించలేదు. పార్టీ ఓటమిపై నిర్వహించిన సమీక్షా సమావేశాలకు కూడా హాజరు కాలేదు. దాంతో ఆయన జనసేనకు దూరమవుతారనే ప్రచారం ముమ్మరంగానే సాగింది. దానికి బలం చేకూరుస్తూ తాజా పరిణామం చోటు చేసుకుంది. పవన్ కల్యాణ్ తాజాగా ఏర్పాటు చేసిన పార్టీ పోలిట్ బ్యూరోలో లక్ష్మీనారాయణకు చోటు దక్కలేదు. పొలిట్ బ్యూరోతో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీలో కూడా ఆయనకు స్థానం దక్కలేదు. నాదెండ్ల మనోహర్, నాగబాబులకు అందులో చోటు దక్కింది. దీంతో జనసేనతో ఆయనకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయనే ప్రచారం సాగుతోంది. అత్యంత కీలకమైన లక్ష్మీనారాయణను పోలిట్ బ్యూరోలో నియమించకపోవడం ఆ ప్రచారానికి ఊతం ఇస్తోంది. గతంలో లక్ష్మినారాయణను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నాయకులు పెద్దగానే ప్రయత్నాలు చేశారు.
First published: July 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading