HOME »NEWS »POLITICS »why is rahul gandhi contesting from wayanad lok sabha seat in kerala ms

రాహుల్ 'వయనాడ్'నే ఎందుకు ఎంచుకున్నారు..? ఇవీ కారణాలు..

రాహుల్ 'వయనాడ్'నే ఎందుకు ఎంచుకున్నారు..? ఇవీ కారణాలు..
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద ఆరు కేసులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Rahul Gandhi contesting from Wayanad Lok Sabha : బీజేపీపై ఇప్పటికే ఉత్తరాది పార్టీ అన్న విమర్శ ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయడం ద్వారా.. కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదికి, దక్షిణాదికి సమ ప్రాధాన్యం ఇస్తోందన్న సంకేతాలను పంపించాలని భావిస్తోంది.

  • Share this:
    కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌ లోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఏకే ఆంటోనీ ఈ విషయాన్ని వెల్లడించడమే ఆలస్యం.. రాహుల్ కేరళ వైపు ఎందుకు చూస్తున్నారన్న చర్చ మొదలైంది. అయితే కాంగ్రెస్ పక్కా వ్యూహంతోనే రాహుల్‌ను వయనాడ్ నుంచి పోటీకి దింపుతోందని తెలుస్తోంది.

    కర్ణాటక, తమిళనాడులతో సరిహద్దు కలిగిన ఏకైక కేరళ రాష్ట్రం వయనాడ్. కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా.. ఆ ప్రభావం మూడు దక్షిణాది రాష్ట్రాలపై ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మూడు రాష్ట్రాలకు చెందిన పీసీసీ సభ్యులు కాంగ్రెస్ అధిష్టానంపై తెచ్చిన ఒత్తిడి మేరకే కాంగ్రెస్ వయనాడ్ వైపు మొగ్గుచూపినట్టు సమాచారం. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ బంపర్ విక్టరీలు కొట్టడంతో.. పార్టీ దీన్ని సేఫ్ సీటుగా భావిస్తోంది. కాబట్టి వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేయడం అన్ని విధాల తమకు లాభిస్తుందనే యోచనలో కాంగ్రెస్ ఉంది.




    బీజేపీపై ఇప్పటికే ఉత్తరాది పార్టీ అన్న విమర్శ ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయడం ద్వారా.. కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదికి, దక్షిణాదికి సమ ప్రాధాన్యం ఇస్తోందన్న సంకేతాలను పంపించాలని భావిస్తోంది. విభజించు పాలించు సిద్దాంతాల ద్వారా దేశంలోని భాషా సంస్కృతులపై, జీవన విధానాలపై బీజేపీ చేస్తున్న దాడులను తిప్పికొట్టడానికి, అదే సమయంలో ఉత్తరాది-దక్షిణాది మధ్య బలమైన సంబంధాలు ఏర్పరచడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోని అన్నారు.

    కాగా, రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయడంపై అక్కడి వామపక్ష ప్రభుత్వం నుంచి ప్రతికూల స్పందన వెలువడింది. సీపీఎం దీనిపై అధికారికంగా స్పందించనప్పనటికీ.. ఆ పార్టీ సీనియర్ నేత ప్రకాశ్ కారత్ మాత్రం.. రాహుల్‌ను తాము ఓడించి తీరుతామని అన్నారు. సీపీఎం నేత్రుత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ వయనాడ్‌లో ఇప్పటికే సీపీఐ అభ్యర్థి పీపీ సునీర్‌ను పోటీలో నిలపడం గమనార్హం. మొత్తం మీద కమ్యూనిస్టుల కంచుకోట కేరళ నుంచి రాహుల్ లోక్‌సభ బరిలో దిగుతుండటం కాంగ్రెస్‌కు ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాలి.
    Published by:Srinivas Mittapalli
    First published:March 31, 2019, 15:33 IST