చంద్రబాబు మీకెందుకంత ఆయాసం.. 23వ తేదీ వరకే మీకు..

Lok Sabha Elections 2019: ఎటువంటి కారణం లేకుండానే ఎందుకు చంద్రబాబు తనకు తానుగా ఆయాస పడిపోతున్నారని ప్రశ్నించింది. ఆయన పడుతున్న ఆత్రుతకు ఈనెల 23న ఫుల్‌స్టాఫ్‌ పడనుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.పైగా, ఆయనకు శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానించింది.

news18-telugu
Updated: May 21, 2019, 10:29 AM IST
చంద్రబాబు మీకెందుకంత ఆయాసం.. 23వ తేదీ వరకే మీకు..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
  • Share this:
వారం రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోనియా, రాహుల్‌ గాంధీలతో పాటు శరద్‌ పవార్‌, మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, శరద్‌ యాదవ్‌, మమతాబెనర్జీని కలిసి చర్చలు సాగిస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే విపక్షాలన్నీ ఒక తాటిపైకి రావాలన్న ఉద్దేశంతో ఆయన ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా రావడంలో ప్రతిపక్షాలు ఆలోచనలో పడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రయత్నాలను శివసేన ఎద్దేవా చేసింది. కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు ఇప్పటికే సమాధానం లభించిందని తమ పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో శివసేన పేర్కొంది. ‘ప్రధాని పదవికి ప్రతిపక్షంలో కనీసం ఐదుగురు పోటీదారులు ఉన్నారు. కానీ వీరి కలలు కల్లలయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు ఇప్పటికే జవాబు దొరికింది. బీజేపీ 300 సీట్లు గెలుస్తుందని అమిత్‌ షా ముందే చెప్పారు. ఐదో విడత ఎన్నికలు ముగిసేసరికే బీజేపీ తన లక్ష్యాన్ని చేరుకుంద’ని శివసేన తెలిపింది.

ఎటువంటి కారణం లేకుండానే ఎందుకు చంద్రబాబు తనకు తానుగా ఆయాస పడిపోతున్నారని ప్రశ్నించింది. ఆయన పడుతున్న ఆత్రుతకు ఈనెల 23న ఫుల్‌స్టాఫ్‌ పడనుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.పైగా, ఆయనకు శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానించింది.

చంద్రబాబు అసెంబ్లీలోకాని, లోక్ సభ సీట్లలో గాని గెలిచే పరిస్థితి లేదని వెల్లడైందని ఆ పత్రిక అభిప్రాయపడింది.సొంత రాష్ట్రంలోనే గెలవలేని బాబు ఇతర పార్టీలను కూడగతారా అని ప్రశ్నించింది. కేంద్రంలో చిన్న చిన్న పార్టీల సహాయంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయితే దాన్ని భరించే స్థితిలో దేశ ప్రజలు లేరని అభిప్రాయపడింది.
First published: May 21, 2019, 10:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading