హరీష్ రావుకు అమెరికాలో ఏం పని?...బీజేపీ నేత విమర్శలు

హరీష్ రావు ప్రస్తుతం అమెరికాలోని ట్యాంపా సిటీలో పర్యటిస్తున్నారు. ఎన్నారై టీఆర్‌ఎస్‌ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

news18-telugu
Updated: May 20, 2019, 3:05 PM IST
హరీష్ రావుకు అమెరికాలో ఏం పని?...బీజేపీ నేత విమర్శలు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు
news18-telugu
Updated: May 20, 2019, 3:05 PM IST
తెలంగాణలో కారు జోరు కొనసాగుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. 14కు పైగా స్థానాలు దక్కించుకుంటుందని జోస్యం చెప్పాయి. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫలితాలకు కొన్ని రోజుల ముందు హరీష్ రావు అమెరికాలో ఎందుకున్నారని ప్రశ్నలు గుప్పించారు. ఇంతటి క్లిష్ట సమయంలో ఆయన అమెరికాకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.  అటు తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు.

మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్లిష్ట సమయంలో హరీశ్ రావు అమెరికాకు ఎందుకు వెళ్లారు? తెలంగాణలో మాకు ఓట్లశాతం బాగా పెరిగింది. ఏడు స్థానాల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమవుతుంది.
లక్ష్మణ్, బీజేపీ చీఫ్[/n
ame]

తెరాస, కాంగ్రెస్ దొందు దొందే.. కేసీఆర్ బిజెపియేతర ప్రభుత్వం అని.. కాంగ్రెస్ కు బయటి నుండి మద్దతు అంటున్నారు. తెరాసలోని అసంతృప్తులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మరింత మంది బిజెపి వైపు వస్తారు. తెలంగాణలో ఎగ్జిట్ పోల్ మించి మాకు సీట్లు వస్తాయి.
లక్ష్మణ్, బీజేపీ చీఫ్


హరీష్ రావు ప్రస్తుతం అమెరికాలోని ట్యాంపా సిటీలో పర్యటిస్తున్నారు. ఎన్నారై టీఆర్‌ఎస్‌ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారి జీవితాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భరోసా ఇస్తోందన్నారు హరీష్ రావు.  సీఎం కేసీఆర్‌ నిర్ణయాలతో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని చెప్పారు. ఎన్నారైల ఆత్మీయత, ఆతిథ్యం చూస్తోంటే తనకు హైదరాబాద్‌లోనే ఉన్నట్టు అనిపిస్తోందన్నారు హరీష్ రావు.


First published: May 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...