కేసీఆర్ గజ్వేల్ టూర్‌కు హరీశ్ రావు దూరం ఎందుకు?

CM KCR Tour | ఇటీవల హరీశ్ రావు సొంత నియోజకవర్గం సిద్దిపేటలో సీఎం కేసీఆర్ సొంతూరు చింతమడకు వెళ్లారు ముఖ్యమంత్రి. అక్కడ మొత్తం హరీశ్ రావు చేతుల మీదుగానే జరిగింది.

news18-telugu
Updated: August 21, 2019, 3:55 PM IST
కేసీఆర్ గజ్వేల్ టూర్‌కు హరీశ్ రావు దూరం ఎందుకు?
చింతమడకలో కేసీఆర్, హరీశ్ రావు (File)
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పర్యటించారు. గజ్వేల్ మండలం కోమటిబండలో నిర్మించిన భగీరథ సంప్‌హౌస్‌ను సీఎం కేసీఆర్‌ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో కలసి సందర్శించారు. సంప్‌హౌజ్‌ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన మిషన్‌ భగీరథ నాలెడ్జ్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల్లో 456 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరందించేందుకు ఈ భారీ సంప్‌హౌస్‌ను ప్రభుత్వం నిర్మించింది. కోటి 40 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఈ భారీ సంప్‌హౌస్‌ నుంచి నిత్యం నీటి సరఫరా జరుగుతోంది. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల్ టూర్‌కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు దూరంగా ఉన్నారు. ఇంత భారీ ఎత్తున జరుగుతున్న కార్యక్రమానికి హరీశ్ రావు దూరంగా ఉండడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఇటీవల హరీశ్ రావు సొంత నియోజకవర్గం సిద్దిపేటలో సీఎం కేసీఆర్ సొంతూరు చింతమడకు వెళ్లారు ముఖ్యమంత్రి. అక్కడ మొత్తం హరీశ్ రావు చేతుల మీదుగానే జరిగింది. ఈ సందర్భంగా చింతమడక మీద కేసీఆర్ వరాలు కురిపించారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. అయితే, తాజాగా కొన్ని రోజుల నుంచి తెలంగాణ కేబినెట్ విస్తరణ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈసారి ఓ మహిళా నేతతో పాటు కేటీఆర్, హరీశ్ రావులకు కూడా కేబినెట్ బెర్త్ ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. అయితే, సడన్‌గా కేసీఆర్ గజ్వేల్ పర్యటనకు హరీశ్ రావు దూరంగా ఉండడం రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, హరీశ్ రావుది సిద్దిపేట నియోజకవర్గం కాబట్టి, కార్యక్రమం జరుగుతోంది కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో కాబట్టే ఆయన దూరంగా ఉన్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు