స్ట్రాంగ్ రూమ్‌కు చేరాల్సిన ఈవీఎంలు తహశీల్దార్ కార్యాలయంలో ఎందుకున్నాయి? : జీవన్ రెడ్డి

జీవన్ రెడ్డి (File)

సమాజంలో ఎవరికీ అపోహలు రాకుండా ఎన్నికల నిర్వహణ ఉంటే సమస్యలు రావన్నారు జీవన్ రెడ్డి. ముఖ్యంగా సంఘటన జరిగిన రోజు తహసిల్ధార్‍, ఆర్‍ఐ విధులల్లో లేరని తహశీల్ధార్ ఏవిధంగా విధులకు ఆటకం కలింగించారని కేసులు నమోదు చేశారని ప్రశ్నించారు.

 • Share this:
  ఎన్నికల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఆధికారులు మీడియాపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఎమ్మెల్సీ జీవన్‍రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య మనుగడలో మీడియాది ముఖ్య పాత్ర అన్నారు. అటువంటి మీడియాలో పని చేస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయడం బాధాకరమన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‍ ఎన్నికల్లో ఈవీఎంలను సరఫరా చేయడం జరిగిందని, వీటిని స్ట్రాం గ్‍రూంకు తరలించాల్సిన బాధ్యత స్థానిక ఎన్నికల ఆధికారిదేనని గుర్తుచేశారు.

  ఎన్నికల మరుసటి రోజు స్ట్రాంగ్‍రూంకు చేరాల్సిన ఈవీఎంలు ఎందుకు తహశీల్థార్‍ కార్యాలయంలో ఉన్నాయని ప్రశ్నించారు. ఈ కమ్రంలో ఈ నెల 15న రాత్రి ఆటో, బైక్‍లో అనుమాస్పదంగా ఈవీఎంలు కనబడటంతో మీడియాలో పని చేసే పాత్రికేయులు బాధ్యతగా రిపోర్టింగ్‍ చేశారనన్నారు. దీనిపై ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాల్సిఉండగా, దీనికి విరుద్దంగా జర్నలిస్టులపై క్రిమినల్‍ కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, స్థానిక ఆధికారులకు వ్యతిరేకంగా పనిచేస్తే కేసులు నమోదు చేయడం జర్నలిస్టులను బెదిరింపులకు గురి చేయడమేనన్నారు.


  ఎం2, ఈవీఎంలు, డెమో ఈవీఎంలు అని ఆధికారులు చెబుతున్నారని, సమయానుగుణంగా ఎన్నికల నిర్వహణ మరుసటి రోజే వాటిని స్ట్రాంగ్‍ రూమ్‌కు చేర్చాల్సిన బాధ్యత ఆధికారులపై ఉందని, పాత్రికేయులపై కేసులు నమోదు చేయడమేమిటని ప్రశ్నించారు. ఏ విధంగా ఎన్నికల నిర్వహణ జరుగుతున్నట్లు సమాజం భావించాలని, ఆధికారులు మాత్రమే భావిస్తే సరిపోదని అన్నారు. సమాజంలో ఎవరికీ అపోహలు రాకుండా ఎన్నికల నిర్వహణ ఉంటే సమస్యలు రావన్నారు. ముఖ్యంగా సంఘటన జరిగిన రోజు తహసిల్ధార్‍, ఆర్‍ఐ విధులల్లో లేరని తహశీల్ధార్ ఏవిధంగా విధులకు ఆటకం కలింగించారని కేసులు నమోదు చేశారని ప్రశ్నించారు.

  పచ్చి అబద్ధాలతో ఆధికారులు ఎందుకు మాట్లాడుతున్నారని, సులువుగా కొంత మేర నిర్లక్ష్యం జరిగిందని రాజకీయ నాయకులతో మీడియా సమావేశం నిర్వహిస్తే సరిపోతుందా అని నిలదీశారు. మీడియా మద్దతు లేకపోతే ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యేదా అని ప్రశ్నించారు. జరిగిన పొరపాటుకు బాధ్యులెవరో వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యతిరేకంగా వార్తలు రాస్తే మీ అంతు చూస్తామనే విధంగా కేసులు పెడితే ఎలా అన్నారు.
  First published: