ట్రంప్ పసుపు రంగు టై ఎందుకు కట్టుకున్నారంటే..

Namastey Trump : ట్రంప్ పసుపు రంగు టై కట్టుకోవడంలో పెద్ద కథే ఉందట. ఆ కలర్ టై కట్టుకోవడంలో గొప్ప సందేశం దాగి ఉందని అంటున్నారు.

news18-telugu
Updated: February 24, 2020, 4:23 PM IST
ట్రంప్ పసుపు రంగు టై ఎందుకు కట్టుకున్నారంటే..
ట్రంప్ దంపతులు
  • Share this:
Donlad Trump Yellow Tie : అమెరికా నుంచి ఇండియాకు బయలు దేరే సమయంలో ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెడ్ కలర్ టై కట్టుకొని ఉన్నారు. వైట్ షర్ట్, రాయల్ బ్లూ కలర్ ప్యాంట్, బ్లూ కలర్ కోటు ధరించి విమానం ఎక్కారు. అయితే.. భారత్‌లో దిగే సరికి ఆయన బ్లాక్ సూట్ ధరించారు. అంతేకాదు.. రెడ్ కలర్ టైకి బదులు పసుపు రంగు టై ధరించారు. మెలానియా కూడా డ్రెస్ మార్చుకొన్నారు. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఆమె.. భారత గడ్డపై కాలు మోపే సరికి వైట్ డ్రెస్‌లో కనువిందు చేశారు. అయితే.. ట్రంప్ రెడ్ కలర్ టై కాకుండా.. పసుపు రంగు టై కట్టుకోవడంలో పెద్ద కథే ఉందట. ఆ కలర్ టై కట్టుకోవడంలో గొప్ప సందేశం దాగి ఉందని అంటున్నారు. యెల్లో కలర్.. ఆనందానికి, వెచ్చదనానికి, ప్రకాశవంతానికి ప్రతీకగా అభివర్ణిస్తున్నారు.

హిందూయిజానికి వచ్చేసరికి ఈ రంగుకు చాలా ప్రాముఖ్యత ఉందట. నాలెడ్జ్‌కు ప్రతీకగా ఈ రంగును వర్ణిస్తారు. స్నేహం చిగురించాలన్న(వసంతం) దానికీ సంకేతంగా ట్రంప్ యెల్లో రంగు టైని కట్టుకున్నారట.

First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు