జగన్‌కు అక్కడ ఇంటర్వెల్లా? లేక కథ ముగిసినట్టేనా?

YSRCP | తెలంగాణలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఉన్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ సీటును కూడా వైసీపీ గెలుచుకుంది.

news18-telugu
Updated: October 9, 2019, 7:04 PM IST
జగన్‌కు అక్కడ ఇంటర్వెల్లా? లేక కథ ముగిసినట్టేనా?
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే దక్కించుకుంది. ఇంతటి ప్రచంఢ విజయాన్ని సాధించిన జగన్ మోహన్ రెడ్డి తెలంగాణలో మాత్రం సైలెంట్‌గా ఉండిపోతున్నారు. 2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదు. అప్పుడంటే.. ఏపీ ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయారని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే, ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి వైసీపీ మద్దతు ఇవ్వలేదు. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఏపీతో పాటు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థులు ఎవరూ తెలంగాణలో బరిలోకి దిగలేదు. తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఏర్పడిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ పోటీకి దూరంగా ఉంది. గతంలో తటస్తంగా వ్యవహరించిన వైసీపీ.. ఈసారి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు పలికింది. టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డిని కలసి మద్దతు కోరడంతో వైసీపీ నేతలు ఓకే చెప్పారు.

ap cm ys jagan meets cm kcr, ys jagan meets kcr, jagan kcr meeting in hyderabad, krishna godavari link, ap news, telangana news, telugu news, కేసీఆర్ జగన్ భేటీ, కేసీఆర్‌తో జగన్ సమావేశం, ప్రగతి భవన్‌లో కేసీఆర్, జగన్ చర్చలు
కేసీఆర్‌తో జగన్ భేటీ


తెలంగాణలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఉన్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ సీటును కూడా వైసీపీ గెలుచుకుంది. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత తెలంగాణకు చెందిన నేతలకు ఏపీలో కొన్ని పదవులు కూడా ఇచ్చారు. తెలంగాణలో కేడర్ ఉండి, ఫాలోయింగ్ ఉన్నా కూడా పోటీకి వైసీపీ దూరంగా ఎందుకు ఉందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. సీఎం కేసీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలను వదులుకోవడం ఇష్టంలేక వైసీపీ ఇలా చేస్తుందా? అనే సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh elections 2019, cm kcr, chandrababu naidu, ysrcp, ys jagan mohan reddy, tdp, trs, polavaram, ap special status, ఏపీ ఎన్నికలు 2019, సీఎం కేసీఆర్, చంద్రబాబునాయుడు, వైసీపీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ, టీఆర్ఎస్, పోలవరం, ఏపీ ప్రత్యేక హోదా
కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్


2014 ఎన్నికల తర్వాత అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు ‘ఆడా ఉంటా.. ఈడా ఉంటా’ అనే ధోరణితో వెళ్లడంతో తెలంగాణలో సమస్యలు ఎదురయ్యాయి. పదేళ్ల వరకు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉన్నా.. హుఠాహుఠిన అమరావతి తరలిపోవాల్సి వచ్చింది. రెండు చోట్లా పార్టీని నిలబెట్టాలనే చంద్రబాబు ప్రయత్నం వల్ల.. అది భవిష్యత్తులో తమకు ప్రమాదకరంగా మారుతుందన్న ఉద్దేశంతోనే తెలంగాణ సీఎం కేసీఆర్.. చంద్రబాబుకు చెక్ పెట్టినట్టు భావిస్తారు. అలాంటి పరిస్థితి జగన్ మోహన్ రెడ్డికి లేదు. జగన్, కేసీఆర్ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా వాటిని పోగొట్టుకోవడం ఇష్టం లేక, పొరుగు రాష్ట్రంతో సమస్యలు ఎందుకులే అనే అభిప్రాయంతో దూరంగా ఉంటున్నారా? అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. తెలంగాణ మీద వైసీపీ వైఖరి ఇంతవరకే పరిమితం అవుతుందా? భవిష్యత్తులో జగన్ వైఖరి మారుతుందా? లేకపోతే ఇంతటితో కథ కంచికి చేరుతుందా? అనే అంశంపై రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading