తిరుమల భూములపై చిన్న జీయర్ స్వామి స్పందించాలి... వీహెచ్ డిమాండ్...

తిరుమల శ్రీవారి భూముల్ని అమ్మాలని ఏపీ ప్రభుత్వం.. తాను తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకున్నా... కలకలం మాత్రం రేగుతూనే ఉంది.

news18-telugu
Updated: May 26, 2020, 2:25 PM IST
తిరుమల భూములపై చిన్న జీయర్ స్వామి స్పందించాలి... వీహెచ్ డిమాండ్...
తిరుమల భూములపై చిన్న జీయర్ స్వామి స్పందించాలి... వీహెచ్ డిమాండ్...
  • Share this:
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి చెందిన వేర్వేరు చిన్న చిన్న భూముల్ని అమ్మాలని ఏపీ ప్రభుత్వం ఏ క్షణాన అనుకుందో... ఆ క్షణం నుంచీ ఈ అంశం రాజకీయంగా దుమారం రేపుతూనే ఉంది. ప్రభుత్వ ఆలోచనపై విమర్శలు రావడంతో... అధికారులు సరిగ్గా వ్యవహరించలేదంటూ... ప్రభుత్వం భూముల అమ్మకాలపై వెనక్కి తగ్గింది. ఐతే... ఈ అంశంతో రాజకీయాల్ని వేడెక్కిస్తున్న నేతలు... ఈ దిశగా మరింత ముందుకి సాగుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ, జనసే, బీజేపీ దీనిపై దూకుడుగా ఉండగా... తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు (వీహెచ్) కూడా స్పందించారు. మరింత నిప్పు రాజేశారు.

ఆలయాల భూముల్ని ప్రభుత్వాలు కాపాడాలి గానీ... అమ్మే హక్కు వాటికి లేదు అన్న వీహెచ్... టీటీడీ ఆస్తుల అమ్మకంపై చిన్న జీయర్ స్వామి ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు. ఈ అశంపై చిన్న జీయర్ స్వామి, శారదా పీఠాధిపతులు స్పందించాలి అని డిమాండ్ చేశారు. ఇలాంటి అంశాలపై స్పందించకుండా వదిలేస్తే... ప్రభుత్వం... తిరుమల ఆలయాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేస్తుందని సెటైర్ వేశారు.

మొదట ఫైర్ అయిన వీహెచ్... తర్వాత శాపనార్థాలు కూడా పెట్టారు. తిరుమలపై ఎవరు కుట్రలు పన్నినా వాళ్లు మిగలరని అన్నారు. దేవుడి భూముల్ని ముట్టుకుంటే స్వామి వదిలిపెట్టరని హెచ్చరించారు. ఇప్పుడీ వివాదాన్ని చిన్నజీయర్ స్వామి కోర్టులోకి పంపారు వీహెచ్. మరి ఆ స్వామి ఏమంటారో.
First published: May 26, 2020, 2:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading