ఇంత జరుగుతున్నా చంద్రబాబు, జగన్ ఇద్దరూ సైలెంట్‌గా ఎందుకున్నారు?

రాష్ట్రంలో టీడీపీ నేతలే లక్ష్యంగా మూడు రోజులుగా సాగుతున్న ఐటీ సోదాల వ్యవహారం అత్యంత గోపంగా ఉంచడాన్ని బట్టి కేంద్రం ఏపీలో భారీ ఆపరేషన్ చేపట్టినట్లు అర్ధమవుతోంది.

news18-telugu
Updated: February 9, 2020, 5:07 PM IST
ఇంత జరుగుతున్నా చంద్రబాబు, జగన్ ఇద్దరూ సైలెంట్‌గా ఎందుకున్నారు?
చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్
  • Share this:
ఏపీలో మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ తో పాటు మరికొందరు సన్నిహితులపై జరుగుతున్న ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర పోలీసులతో సంబంధం లేకుండా సీఆర్పీఆఫ్ బలగాల భద్రత మధ్య జరుగుతున్న ఈ దాడుల్లో అత్యంత కీలకమైన సమాచారంతో పాటు పలువురు టీడీపీ నేతల పేర్లు కూడా వెల్లడవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పందించేందుకు అటు టీడీపీ, వైసీపీ నేతలే కాదు ఐటీ వర్గాలు సైతం ఆసక్తి చూపడం లేదు.

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ తో పాటు ఆయన కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు, లోకేష్ కు సన్నిహితులైన కిలారు రాజేష్, గుత్తా కిరణ్, టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి నివాసాలపై 72 గంటలుగా జరుగుతున్న ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. విజయవాడ, గుంటూరు, కడప, హైదరాబాద్ లో ఏకకాలంలో సాగుతున్న ఈ దాడుల్లో భారీ ఎత్తున ఫైళ్లతో పాటు హార్డ్ డిస్క్ లను ఇతర కీలక సమాచారాన్ని ఐటీ వర్గాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓ ఇన్ ఫ్రా సంస్ధ నుంచి విరాళాలు తీసుకున్న వ్యవహారంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు చెబుతున్నా ఇంత వరకూ ఐటీ వర్గాల నుంచి అధికారిక సమాచారమేదీ లేదు. సదరు ఇన్ ఫ్రా సంస్ధ నుంచి తీసుకున్న విరాళాలు ఎవరెవరికి వెళ్లాయి ? ఏయే మార్గాల్లో వెళ్లాయి ? వీటి ద్వారా అంతిమంగా లబ్ధి పొందిందెవరు అన్న కోణంలో ఈ సోదాలు సాగుతున్నట్లు అర్ధమవుతోంది. ఏకంగా చంద్రబాబుకు గతంలో పీఎస్ గా పనిచేసిన సచివాలయ సాధారణ పరిపాలనశాఖ ఉద్యోగి పెండ్యాల శ్రీనివాసరావును సుదీర్ఘంగా విచారిస్తున్న ఐటీ అధికారులు ఆయన్ను హైదరాబాద్ తరలించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. విచారణలో భాగంగా శ్రీనివాస్ ఇద్దరు మాజీ ఎంపీల పేర్లను కూడా బయటపెట్టినట్లు అనధికార వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు రాష్ట్రంలో టీడీపీ నేతలే లక్ష్యంగా మూడు రోజులుగా సాగుతున్న ఐటీ సోదాల వ్యవహారం అత్యంత గోపంగా ఉంచడాన్ని బట్టి కేంద్రం ఏపీలో భారీ ఆపరేషన్ చేపట్టినట్లు అర్ధమవుతోంది. ఇందులో బెంగళూరు, చెన్నైకి చెందిన ఐటీ అధికారులతో పాటు జీఎస్టీ, రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. భారీగా ఆర్ధిక అవకతవకలు జరిగిన సందర్భాల్లో  మాత్రమే ఐటీ వర్గాలు ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో సోదాలు నిర్వహిస్తుంటాయి. దీంతో ఐటీ దాడుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అన్న ఆందోళన కూడా టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ దాడుల్లో ఐటీతో పాటు ఈడీ అధికారులు కూడా పాలుపంచుకుంటున్నట్లు మరో ప్రచారం కూడా సాగుతోంది.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
Published by: Ashok Kumar Bonepalli
First published: February 9, 2020, 5:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading