GHMC Elections: గ్రేటర్‌లో పవన్‌‌ను బీజేపీ పక్కన పెట్టడానికి కారణం ఏంటి?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా సింగ‌ల్ గా బ‌రిలో దిగ‌డానికే మొగ్గు చూపుతున్నారు. ఇప్ప‌టికే 80 స్థానాల్లో త‌మ పార్టీ నుంచి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు.

news18-telugu
Updated: November 18, 2020, 5:20 PM IST
GHMC Elections: గ్రేటర్‌లో పవన్‌‌ను బీజేపీ పక్కన పెట్టడానికి కారణం ఏంటి?
పవన్ కల్యాణ్, బండి సంజయ్
  • Share this:
(ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్ 18)

జీహెచ్ఎంసీ స‌మ‌రానికి తెర లేచింది. ఇప్ప‌టికే ప్ర‌ధానంగా పోటీ ఏ రెండు పార్టీ మ‌ధ్య ఉండ‌బోతుంద‌నే క్లారిటి దుబ్బాక ఫ‌లితాలు త‌రువాత అంద‌ర్లోనూ వ‌చ్చింది. అయితే అధికార‌పార్టీ టీఆర్ఎస్, బీజేపీలతో పాటు ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాట‌డానికి రెడీ అవుతున్నాయి కాంగ్రెస్, టీడీపీ, జ‌న‌సేనలు. జనసేన పార్టీ తొలిసారి గ్రేటర్ ఎన్నికల బరిలో దిగుతోంది. అయితే బీజేపీ, జ‌న‌సేన‌ మధ్య ఏపీలో పొత్తు ఉన్న‌ప్ప‌టికి ఇక్క‌డ ఆ పొత్తు వ‌ర్క‌వుట్ అవ్వ‌దనే ఆలోచ‌న‌లో ఉన్నారు బీజేపీ నేత‌లు. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తాము ఎవ్వ‌రితో పొత్తు పెట్టుకోమ‌నే స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. ప‌వ‌న్ తో పొత్తు పెట్టుకుంటే పార్టీ కి లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తోన్నారు. అందులో భాగంగానే దుబ్బాక‌లో ప‌వ‌న్ తో ప్ర‌చారం చేయించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేసిన చివరి నిముషంలో ర‌ద్దు చేశారు. తెలంగాణ‌లో ప‌వ‌న్ బీజేపీ జెండా ఎత్తితే అది త‌మ‌కే న‌ష్ట‌మ‌ని భావిస్తోన్నాయి బీజేపీ వ‌ర్గాలు. ప‌వ‌న్ ని ఇక్క‌డ ప్ర‌ధాన ప్ర‌చారం ఆయుధంగా వినియోగించుకుంటే అది త‌మ పార్టీ కంటే అధికార‌ పార్టీ టీఆర్ఎస్ కే క‌లిసోస్తుంద‌ని లెక్క‌లేస్తోన్నారు.

ప‌వ‌న్ త‌మ పార్టీ నుంచి ప్ర‌చారం చేస్తే ఆంధ్ర పార్టీ అని త‌మ‌పై ముద్ర వేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అందుకే ప‌వ‌న్ తో తెలంగాణ‌లో ఎంత దూరంగా ఉంటే అంత మంచిద‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు క‌మ‌ల‌ద‌ళం నేత‌లు. ఇదిలా ఉంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా సింగ‌ల్ గా బ‌రిలో దిగ‌డానికే మొగ్గు చూపుతున్నారు. ఇప్ప‌టికే 80 స్థానాల్లో త‌మ పార్టీ నుంచి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. దీంతో పాటు వ‌కీల్ సాబ్ షూటింగ్ కూడా బ్రేక్ ఇచ్చి ప‌వ‌న్ జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జ‌న‌సేన‌కు బాగా ప‌ట్టున్న స్థానాల్లో ప‌వ‌న్ ప్ర‌చారం చేసేలా ప్ర‌ణాళిక రూపోందిస్తోన్నారు ఆ పార్టీ నేత‌లు.

ప‌వ‌న్ ప్ర‌చారం చేస్తే అధికార‌ పార్టీ ఓట్లు భారీగా చీలే అవ‌కాశం ఉన్నందున దీనికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ అండ్ కో కూడా వ్యూహత్మ‌కంగా అడుగులు వేస్తోన్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వ‌ర్క‌వుట్ అయ్యే తెలంగాణ సెంటిమెంట్ ఈ ఎన్నిక‌ల్లో వ‌ర్క‌వుట్ అవ్వ‌డం కాస్త క‌ష్టం కాబ‌ట్టి ఇత‌ర అంశాల‌పై అధికార‌పార్టీ శ్రేణులు దృష్ఠి పెడుతున్నారు. మ‌రో వైపు ప‌వ‌న్ బీజేపీకి బ‌హిరంగంగా మ‌ద్ద‌తు తెల‌ప‌క‌పోయిన లోప‌యికారంగా ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన శ్రేణులు కొన్ని స్థానాల్లో బీజేపీ గెలుపు కోసం ప‌నిచేయ‌డం కోసం అంగీకారం తెలిపిన‌ట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పవ‌న్ ప్ర‌చారం చేస్తే ఎన్నో కొన్ని ఓట్లు చీలే ప్ర‌మాద‌మున్న నేప‌థ్యంలో దాన్ని అరిక‌ట్టేందుకు వ్యూహాలు రచిస్తోన్నారు అధికార‌పార్టీ నేత‌లు. ఇప్ప‌టికే దుబ్బాక ఓట‌మి తరువాత ఈ ఎన్నిక‌లను చాలా ప్ర‌తిష్ట‌ాత్మ‌కంగా తీసుకుంటున్నారు. ఇక్క‌డ భారీ స్తాయిలో గెలిచి త‌మ‌పై ప్ర‌జ‌ల విశ్వాసం ఉంద‌ని నిరూపించుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తోన్నాయి ఆ పార్టీ శ్రేణులు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 18, 2020, 5:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading