సీఎం జగన్‌కు ఏమైంది.. ఎన్నికల వాయిదాపై ఆందోళన ఎందుకు..?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నామని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ప్రకటించగానే సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలు జరగకపోతే రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: March 18, 2020, 7:34 AM IST
సీఎం జగన్‌కు ఏమైంది.. ఎన్నికల వాయిదాపై ఆందోళన ఎందుకు..?
సీఎం వైఎస్ జగన్(AP CM YS Jagan)
  • Share this:
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నామని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ప్రకటించగానే సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలు జరగకపోతే రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎన్నికల కమిషనర్‌పై దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వం ఉండి ఎందుకని, ఇష్టమొచ్చినట్లు వాయిదా ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఏకంగా ఎన్నికల కమిషనర్‌కు కులం పేరును ఆపాదించారు. అయితే, ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగానే సీఎం జగన్ ఇంతలా ఎందుకు ఆందోళన చెందాల్సి వచ్చింది? వెంటనే గవర్నర్ దగ్గరికి వెళ్లి ఎన్నికల కమిషనర్‌పై ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? సీఎంగా గెలిచినప్పటి నుంచి ప్రెస్ మీట్ పెట్టని ఆయన.. హుటాహుటిన ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టాల్సి వచ్చింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయని సీఎం చెబుతున్నారని, కానీ.. అంతకంటే పెద్ద అంశం ఇంకోటి ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. పైగా, ఎన్నకల కమిషనర్‌కు కులం పేరు ఆపాదించారని.. ఈ మధ్యకాలంలో సీఎం జగన్ ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలు లేవని.. కానీ ఇప్పుడు ప్రెస్‌ మీట్‌లోనే ఆ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. ఏదైనా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు ‘ఎన్నికల వాయిదా’ అడ్డంకిగా మారిందని అంటున్న సీఎం ఆందోళన వెనుక అసలు కారణం ఏంటని ప్రశ్నించుకుంటున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: March 18, 2020, 7:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading