‘ఔనా.. జగన్ గెలిచాడా?’ అని ఇండస్ట్రీలో వెటకారం చేసిందెవరు?

వైసీపీ తరఫున ప్రచారం చేసిన వారికి వేషాలు ఇవ్వొద్దని సినీ ఇండస్ట్రీలో చెబుతున్నారని, తాను ఎవరో చాన్స్‌లు ఇస్తారనే అభిప్రాయంతో తాడేపల్లిగూడెం నుంచి ట్రంక్ పెట్టెతో రాలేదన్నారు.

news18-telugu
Updated: July 28, 2019, 3:08 PM IST
‘ఔనా.. జగన్ గెలిచాడా?’ అని ఇండస్ట్రీలో వెటకారం చేసిందెవరు?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (File)
  • Share this:
30 ఇయర్స్ పృధ్వీగా తెలుగు ప్రేక్షుకులకు సుపరిచితుడైన పృధ్వీరాజ్ సంచలన ఆరోపణలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ మీడియా చానల్‌తో మాట్లాడిన పృథ్వీ.. జగన్ ఏపీ సీఎం కావడం తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇష్టం లేదన్నారు. చంద్రబాబునాయుడు సీఎం అయ్యి ఉంటే.. అందరూ ఉదయం 6.40 ఫ్లైట్‌కి అమరావతి వెళ్లి టీడీపీ అధినేతను కలిసేవారని ఆరోపించారు. 151 సీట్లు సాధించి ఏపీలో ఘన విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ గురించి దేశం మొత్తం తెలిసింది. అయితే, ఇండస్ట్రీలోని ఓ వ్యక్తి ‘ఔనా, జగన్ గెలిచాడా?’ అంటూ వెటకారం చేశారని అన్నారు. అయితే, ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని మాత్రం పృథ్వీరాజ్ బయటపెట్టలేదు. తెలుగు సినీ పరిశ్రమ కార్మికుల కోసం ఓ బొకే తీసుకుని వెళ్లి జగన్‌ను కలిస్తే తప్పేముందన్నారు.

వైసీపీ తరఫున ప్రచారం చేసిన వారికి వేషాలు ఇవ్వొద్దని సినీ ఇండస్ట్రీలో చెబుతున్నారని, తాను ఎవరో చాన్స్‌లు ఇస్తారనే అభిప్రాయంతో తాడేపల్లిగూడెం నుంచి ట్రంక్ పెట్టెతో రాలేదన్నారు. తనను తీసుకుంటే బావుంటుందని భావిస్తే నిర్మాతలు, దర్శకులు తనను తీసుకుంటారని, ఒకవేళ తీసుకోకపోతే వారి ఖర్మ అని వ్యాఖ్యానించారు.

First published: July 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు