సర్వేలన్నీ ఇలా మిశ్రమ ఫలితాలను వెల్లడించడంతో ఎవరి సర్వేను నమ్మాలో తెలియక జనం తలలు పట్టుకున్నారు. నేతలు మాత్రం తమకు అనుకూలంగా వెలువడిన సర్వేలనే నిజమైన సర్వేలుగా నమ్ముతున్నారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసి.. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వచ్చేశాయి. అయినా సరే ఏపీలో గెలుపెవరిది అన్నదానిపై అంత స్పష్టత మాత్రం రాలేదు. కొన్ని సర్వేలు.. టీడీపీకి పట్టం కట్టగా.. మరికొన్ని సర్వేలు వైసీపీదే అధికారం అని తేల్చేశాయి. దీంతో ఇరు వర్గాల్లోనూ గెలుపుపై ధీమా పెరిగినప్పటికీ.. అసలు ఎవరి సర్వేను ప్రామాణికంగా తీసుకోవాలన్నది ఇప్పుడు వారికే అంతుచిక్కడం లేదు.
ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో టీడీపీకి 90 నుంచి 110, వైసీపీకి 65 నుంచి 79, ఇతరులకు 1 నుంచి 3 స్థానాలు వస్తాయని తేల్చారు. అలాగే లోక్‌సభ స్థానాల విషయానికొస్తే.. టీడీపీకి 15, వైసీపీకి 10 వరకు రావచ్చునని చెప్పారు. ఇండియా టుడే సర్వే మాత్రం ఏపీలో వైసీపీదే అధికారం అని అంచనా వేసింది. వైసీపీ 130 - 135 స్థానాలతో భారీ మెజారిటీ అందుకోబోతుందని.. టీడీపీ మాత్రం 37-40 స్థానాలకు మించి గెలవలేదని అంచనా వేసింది. లోక్‌సభ స్థానాల్లో టీడీపీ 4 - 6 , వైసీపీ 18 - 20 గెలవవచ్చునని అంచనా వేసింది.ఇక సీపీఎస్ సర్వే (అసెంబ్లీ) టీడీపీ 43 - 44, వైసీపీ 130 - 133 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది.
సర్వేలన్నీ ఇలా మిశ్రమ ఫలితాలను వెల్లడించడంతో ఎవరి సర్వేను నమ్మాలో తెలియక జనం తలలు పట్టుకున్నారు. నేతలు మాత్రం తమకు అనుకూలంగా వెలువడిన సర్వేలనే నిజమైన సర్వేలుగా నమ్ముతున్నారు. అయితే ఈవీఎంలలో నిక్షిప్తమైన తీర్పు వెలువడాలంటే మాత్రం మరో రెండు రోజులు ఉత్కంఠను భరించక తప్పదు. మొత్తం మీద ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ క్రియేట్ చేసిన గందరగోళానికి మరో 48 గంటల నిరీక్షణ తర్వాతే తెరపడుతుందని చెప్పాలి.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.