తెలంగాణలో లోక్‌సభ సీట్లు ఎవరికెన్ని..ఇదీ కే.నాగేశ్వర్ విశ్లేషణ

తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లలో పోలైన ఓటింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకుని లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కే అవకాశం ఉందన్న అంశంపై ప్రొ.కే.నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణ ఇది.

news18-telugu
Updated: December 28, 2018, 10:36 PM IST
తెలంగాణలో లోక్‌సభ సీట్లు ఎవరికెన్ని..ఇదీ కే.నాగేశ్వర్ విశ్లేషణ
ప్రొఫెసర్ నాగేశ్వర్ (ట్విట్టర్)
news18-telugu
Updated: December 28, 2018, 10:36 PM IST
మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిగణలోకి తీసుకుంటే వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశముంది? ఈ ప్రశ్నకు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫసర్ కే.నాగేశ్వర్ తన అభిప్రాయం వ్యక్తంచేశారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఐదు మాసాల కాలం ఉన్నందున ఫలితాలను ఇప్పుడే గణించడం తొందరపాటు అవుతుందన్నారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని విశ్లేషిస్తే హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉందన్నారు.  ఖమ్మం, మెహబూబాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు అవకాశాలున్నాయని చెప్పారు. మిగిలిన 14 లోక్‌సభ స్థానాల్లోనూ అధికార టీఆర్ఎస్‌కే విజయావకాశాలు ఉన్నట్లు విశ్లేషించారు. అయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మొన్నటి ఎన్నికల్లో ఆయా పార్టీలకు పోల్ అయిన ఓట్లను పరిగణలోకి తీసుకుని ప్రొఫసన్ నాగేశ్వర్ ఈ అభిప్రాయం చెప్పారు.

అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ సీఎంగా కొనసాగాలా? వద్దా? అన్న అంశంపై ప్రధానంగా పోలింగ్ జరిగిందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రధానిగా ఎవరు ఉండాలన్న అంశంపై ఓటింగ్ జరుగుతుందని విశ్లేషించారు. అసెంబ్లీ ఎన్నికల్లోలానే లోక్‌సభ ఎన్నికల్లోనూ పోలింగ్ సరళి ఉంటుందని భావించలేమని అభిప్రాయపడ్డారు. ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ కింద వీడియోలో చూడండి.


First published: December 28, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...