Huzurabad: మరికొద్ది గంటల్లో హుజూరాబాద్ ప్రచారం బంద్.. లాస్ట్ పంచ్ ఎవరిది ?

హరీశ్ రావు, ఈటల రాజేందర్ (ఫైల్)

Huzurabad By Election: నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసిపోతుండటంతో.. ఆ తరువాత ప్రలోభాల పర్వానికి తెరలేచే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

  • Share this:
    ఎంతో ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లోనే ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలతో ప్రచార పర్వానికి తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ముఖ్యనేతలు ప్రచారంలో బిజీ అయిపోయారు. మరీ ముఖ్యంగా ఇక్కడ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. బీజేపీ తరపున అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Rajendar), టీఆర్ఎస్ తరపున మంత్రి హరీశ్ రావు (Harish Rao) ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పైనే బీజేపీ ఆశలు పెట్టుకోగా.. టీఆర్ఎస్ తరపున అన్నీ తానై ప్రచారం బాధ్యతలు భుజాన వేసుకున్న మంత్రి హరీశ్ రావుపైనే టీఆర్ఎస్ ఎక్కువగా ఆధారపడుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు.

    ప్రచార పర్వం మరికొద్ది సేపట్లోనే ముగియనుండటంతో.. క్యాంపెయిన్‌లో లాస్ట్ పంచ్ ఎవరిది అనే చర్చ కూడా సాగుతోంది. ఎన్నికల ప్రచారం ముగిసే సమయంలో నేతలు ఒక్కోసారి కీలకమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ నేతలు అలాంటి వ్యాఖ్యలు చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది. ఇటు టీఆర్ఎస్‌కు, అటు ఈటల రాజేందర్‌కు గెలుపు ఎంతో కీలక కావడంతో.. రెండు వైపుల నుంచి ప్రచారం చివరి దశలో సంచలనమైన కామెంట్స్ రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. అలా ఎవరూ ఈ రకమైన వ్యాఖ్యలు చేసినా.. అది హుజూరాబాద్ (Huzurabad) ఉప ఎన్నికపై ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.

    మరోవైపు ప్రచారానికి గడువు ముగుస్తున్న తరుణంలో ప్రలోభాలకు తెర లేచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలే డబ్బులు పంచుతున్నాయని టీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. మరోవైపు అధికార పార్టీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీఆర్ఎస్ భారీగా డబ్బు పంచుతోందని ఆరోపిస్తున్న బీజేపీ.. ఆ పార్టీ ఎంత డబ్బు ఇచ్చిన తీసుకుని తమకు ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిస్తోంది.

    Etela Rajendar: పిచ్చి పట్టిందా హరీశ్ ?.. దానితో నాకేం సంబంధం.. మండిపడ్డ ఈటల రాజేందర్

    Revanth Reddy ముందస్తు వ్యూహం.. KCR ప్లాన్‌కు కౌంటర్.. Congress హైకమాండ్ ఓకే చెబుతుందా ?

    ఇక నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసిపోతుండటంతో.. ఆ తరువాత ప్రలోభాల పర్వానికి తెరలేచే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. రేసులో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలకు తెరలేపే అవకాశం ఉండటంతో.. వారిని అడ్డుకోవడం అధికారులు, పోలీసులకు ఓ సవాల్‌గా మారే అవకాశం ఉంది.
    Published by:Kishore Akkaladevi
    First published: