మోదీ కేబినెట్‌లో ఛాన్స్ ఎవరికి... మార్పులు ఉంటాయా ?

Narendra Modi new cabinet | కేబినెట్‌లోకి ఎవరికి తీసుకోవాలని దాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ఐదు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. దీంతో కేబినెట్ సభ్యుల ఎంపిక కొలిక్కి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: May 29, 2019, 11:05 AM IST
మోదీ కేబినెట్‌లో ఛాన్స్ ఎవరికి... మార్పులు ఉంటాయా ?
నరేంద్రమోదీ(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: May 29, 2019, 11:05 AM IST
కేంద్రంలో రెండోసారి కొలువుదీరనున్న నరేంద్రమోదీ కొత్త కేబినెట్‌లో ఎవరెవరుంటారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కేబినెట్‌లోకి ఎవరికి తీసుకోవాలని దాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ఐదు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. దీంతో కేబినెట్ సభ్యుల ఎంపిక కొలిక్కి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కేబినెట్‌లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనే అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. ఈ ఏడాది మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాతో పాటు వచ్చే ఏడాది ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో బీజేపీ చీఫ్ మోదీ కేబినెట్‌లో చేరతారా లేక ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు పూర్తయ్యేంతవరకు వెయిట్ చేస్తారా అన్న అంశం ఆసక్తిరేపుతోంది.

అయితే కేబినెట్‌లోకి మరోసారి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పియూష్ గోయల్‌లను తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. హోం, ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖ మంత్రుల విషయంలో మార్పులు చేయొచ్చని తెలుస్తోంది. అనారోగ్య సమస్య కారణంగా ఇబ్బందిపడుతున్న అరుణ్ జైట్లీని ఈసారి మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అన్న అంశంపై స్పష్టత రాలేదని సమాచారం. ఇక ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన శివసేన, జేడీయూలకు ఒక కేబినెట్ ర్యాంకు పదవితో పాటు ఒక సహాయ మంత్రి పదవి దక్కబోతున్నట్టు తెలుస్తోంది. బీహార్‌లోని ఎల్‌జేపీకి కూడా ఒక పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఏపీ కొత్త సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరుకాబోతున్నారు.First published: May 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...