Gujarat New CM: గుజరాత్​ సీఎం భూపేంద్ర పటేల్​ ఎవరు? ఆయనకే సీఎం పదవి ఎందుకు? ఆయన రాజకీయ నేపథ్యం ఏమిటి?

భూపేంద్ర పటేల్​

బీజేపీ (BJP) అధిష్టానం నిర్ణయం అందరినీ షాక్​కు గురిచేసింది. గుజరాత్(Gujarat)​కు కొత్త ముఖ్యమంత్రి (New Chief Minister)గా ఎంపికయ్యారు. రేసులో లేని భూపేంద్ర పటేల్​ను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకోవడం అనూహ్య నిర్ణయమే అయితే.. ఇంతకీ ఈ భూపేంద్ర పటేల్ ఎవరు.. రాజకీయ నేపథ్యం ఏమిటీ? ఒకసారి తెలుసుకుందాం.

 • Share this:
  భూపేంద్రభాయి పటేల్ (Bhupedrabhai Patel)​. గుజరాత్(Gujarat)​కు కొత్త ముఖ్యమంత్రి (New Chief Minister)గా ఎంపికయ్యారు. ఆదివారం అహ్మదాబాద్​లో నరేంద్ర సింగ్​ తోమర్​ నేతృత్వంలో జరిగిన సమావేశంలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా భూపేంద్ర పటేల్ (Bhupendra Patel)​ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. సోమవారం భూపేంద్ర పదవీ బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ (Gujarat CM Vijay rupani) అనూహ్య రాజీనామాతో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ ఊపందుకుంది. ఈ తరుణంలో ప్రధానంగా నలుగురు బీజేపీ సీనియర్‌ నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో గుజరాత్‌ డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్ (Gujarat Deputy CM Nitin Patel)‌, వ్యవసాయ శాఖమంత్రి ఆర్‌సీ ఫాల్దుతో పాటు కేంద్రమంత్రులుగా ఉన్న పురుషోత్తం రూపాలా (Purusotham Roopala), మన్‌సుఖ్‌ మాండవీయ (Mansukh Mandaviya) పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చివరికి భూపేంద్ర పటేల్​(Bhupendra Patel)కు అవకాశం ఇచ్చారు.

  భారీ మెజారిటీతో..

  బీజేపీ (BJP) అధిష్టానం నిర్ణయం అందరినీ షాక్​కు గురిచేసింది. రేసులో లేని భూపేంద్ర పటేల్​ను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకోవడం అనూహ్య నిర్ణయమే అయితే.. ఇంతకీ ఈ భూపేంద్ర పటేల్ ఎవరు.. రాజకీయ నేపథ్యం ఏమిటీ? ఒకసారి తెలుసుకుందాం.. గుజరాత్ మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్‌‌తో సాన్నిహిత్యమున్న పటేల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. ఘట్లోడియా (Ghatlodia) నియోజకవర్గంలో శశికాంత్ పటేల్‌పై 1.17లక్షల ఓట్ల మెజార్టీతో రికార్డు నమోదు చేశారు. ఈ నియోజకవర్గానికి అంతకు క్రితం ఆనందిబెన్ పటేల్ ప్రాతినిధ్యం వహించారు. అయితే భూపేంద్ర పటేల్​ కనీసం మంత్రి (Minister)గా కూడా పనిచేయకుండా ఏకంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటుండటం విశేషం.

  పాటిదార్​ సమాజం వ్యక్తి..

  మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన 59 ఏళ్ల భూపేంద్ర పటేల్ది గుజరాత్‌లోని ఉత్తర ప్రాంతం (north area). సౌరాష్ట్రలో అధిక ప్రాబల్యమున్న పాటిదార్ (Patidar) కమ్యూనిటీకి చెందినవారు. పాటిదార్ కమ్యూనిటీ ఉప కులం కడ్వాకు చెందిన వ్యక్తి. గుజరాత్‌లో విజయానికి పాటిదార్ కమ్యూనిటీ నిర్ణయాత్మకంగా ఉంది. రాష్ట్ర ఎకానమీపైనా పట్టున్న కో ఆపరేటివ్ సెక్టార్, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, కన్‌స్ట్రక్షన్‌లలో వీరిదే కీలకపాత్ర.

  వ్యాపార వర్గాలతో సంబంధాలు..

  వివాద రహితుడిగా ఉన్న భూపేంద్ర పటేల్‌కు రాష్ట్రంలోని వ్యాపార వర్గాలతోనూ  (Industrialists) సన్నిహిత సంబంధముంది. ఆయన సీఎంగా ఎంచుకోవడానికి ఈ అంశమూ కలిసొచ్చింది. ఆయన ఇదివరకు మంత్రిగా చేయకున్నా, అందుకు కావాల్సిన అనుభవం ఆయన దగ్గర ఉన్నదని ఓ బీజేపీ నేత తెలిపారు. మృదు స్వభావిగా పటేల్​కు పేరుంది.

  పాటిదార్ ఆర్గనైజేషన్లు సర్దార్ ధామ్, విశ్వ ఉమియ ఫౌండేషన్‌‌లకు భూపేంద్ర పటేల్ ట్రస్టీగా ఉన్నారు. ఎమ్మెల్యే కాకముందు ఆయన అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి 2015 నుంచి 2017 వరకు చైర్మన్‌గా ఉన్నారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా 1995, 1996లో కొనసాగారు. మేమ్‌నగర్ పాలికకు 1999 నుంచి 2000 వరకు ప్రెసిడెంట్‌గా, స్కూల్ బోర్డ్ ఆఫ్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 2008 నుంచి 2010 వరకు వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. తల్టేజ్ వార్డ్ నుంచి 2010 నుంచి 2015 వరకు కౌన్సిలర్‌గా ఉన్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published: