జేసీకి ‘ఫ్యాన్ గాలి’ రాకుండా అడ్డుకుంటోంది ఎవరు?

అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ హవా నడిచింది. సుమారు మూడు దశాబ్దాల పాటు వారు ఆడిందే ఆట. పాడిందే పాట. 2019 ఎన్నికల్లో తొలిసారి జేసీ బ్రదర్స్ హవాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గండికొట్టింది.

news18-telugu
Updated: September 7, 2019, 3:33 PM IST
జేసీకి ‘ఫ్యాన్ గాలి’ రాకుండా అడ్డుకుంటోంది ఎవరు?
వైఎస్ జగన్, జేసీ దివాకర్ రెడ్డి
  • Share this:
అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోకి తాము వెళితే రానిస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీలోకి జేసీ కుటుంబాన్ని రానివ్వకుండా ఎవరో అడ్డుకుంటున్నారనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన జేసీ దివాకర్ రెడ్డి... జగన్ మోహన్ రెడ్డి వంద రోజలు పాలనకు 100 మార్కులు వేశారు. జగన్‌ను చేయిపట్టి నడిపించే వారి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, జగన్ పిలవకుండా వెళితే ఎందుకొచ్చారని ప్రశ్నిస్తారని జేసీ చెప్పుకొచ్చారు. వైసీపీలో చేరతారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ‘అక్కడ మమ్మల్ని రానిస్తారా?’ అని ఎదురు ప్రశ్నించారు. అంటే వైసీపీలో జేసీ బ్రదర్స్ చేరికకు ఎవరో గండికొడుతున్నట్టు ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.

అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ హవా నడిచింది. సుమారు మూడు దశాబ్దాల పాటు వారు ఆడిందే ఆట. పాడిందే పాట. తొలిసారి జేసీ బ్రదర్స్ హవాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గండికొట్టింది. అనంతపురం, తాడిపత్రిల్లో జేసీ వారసులు ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ జేసీ బ్రదర్స్‌ను వైసీపీలో చేర్చుకుంటే మళ్లీ వారి హవా మొదలవుతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో జేసీ దివాకర్ రెడ్డి తనకు తోచినట్టు మాట్లాడేవారు. జగన్ మీద కూడా కొన్ని సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. టీడీపీ పాలనలో అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలను ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటికంటే తనకు తోచినట్టు మాట్లాడే జేసీ దివాకర్ రెడ్డి నోటితీరు వల్ల సమస్యలు వస్తాయని వైసీపీ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే వైసీపీలోని కొందరు జేసీ చేరికను అడ్డుకుంటున్నారని భావిస్తున్నారు. మరోవైపు, జేసీ బ్రదర్స్ బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా ఉంది.
First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading