రాజధాని విషయంలో జగన్‌ను నడిపించింది ఆయనే

విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకుంటే వాస్తుపరంగా చాలా బాగుంటుందని జగన్ కు ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: December 21, 2019, 9:02 AM IST
రాజధాని విషయంలో జగన్‌ను నడిపించింది ఆయనే
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
  • Share this:
ఏపీలో మూడు రాజధానులంటూ జగన్ సంచలన ప్రకటన చేశారు. అటు ప్రతిపక్షంతో పాటు.. ఇటు పార్టీ నేతల్ని సైతం జగన్ ప్రకటనవిని షాక్ అయ్యారు. అయితే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన విషయంలో జగన్ ను ప్రభావితం చేసింది ఎవరు ?  ఆయనను గైడ్ చేసింది ఎవరు?  జగన్ వెనుక ఎవరున్నారు ? అనే అంశంపై ఇపుడు ఆసక్తికర చర్చ మొదలైంది.  ఏదో పేరుకు సౌత్ ఆఫ్రికా పద్దతిలో మూడు రాజధానులు అని జగన్ అన్నా అసలు విషయం అది కాదన్న ప్రచారం పెరిగిపోతోంది. అయితే ఈ వ్యవహారంలో విశాఖపట్నంలోనే ఉన్న శారధా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రభావమే ఎక్కువగా ఉందని సమాచారం.

విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకుంటే వాస్తుపరంగా చాలా బాగుంటుందని జగన్ కు స్వామి  తెలుస్తోంది. ప్రస్తుతం అమరావతి నిర్మాణానికి వాస్తు బాగాలేదని అప్పట్లోనే చాలామంది పండితులు చెప్పినా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. అయితే చివరకు ఐదేళ్ళల్లోనే అసెంబ్లీకి, సచివాలయానికి ఎన్నోసార్లు వాస్తు మార్పులు చేయించారు చంద్రబాబు. జగన్ సిఎం అయిన వెంటనే సచివాలయంలో వాస్తు మార్పులు చేయించిన తర్వాతే అడుగుపెట్టారు.  రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రితో చంద్రబాబు శంకుస్ధాపన చేయించిన స్ధలమే వాస్తుపరంగా మంచిది కాదని అప్పట్లో చాలా అభ్యంతరాలే వచ్చాయి. అమరావతి ప్రాంతం వాస్తుపరంగా రాజధాని నిర్మాణానికి ఏమాత్రం అనుకూలం కాదని చాలామంది వాస్తు పండితులు తేల్చేశారు. ఈ నేపధ్యంలోనే స్వరూపానంద స్వామి ఇదే విషయాన్ని జగన్ కు స్పష్టం చేశారట. అమరావతి స్ధానంలో విశాఖపట్నం అయితే ఒకవైపు కొండలు, మరోవైపు సముద్రం వాస్తు ప్రకారం బ్రహ్మాండంగా ఉంటుందని చేసిన సూచనే జగన్ మీద పనిచేసిందని అంటున్నారు.

First published: December 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు