జగన్ మద్దతు వారికే.. హింట్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి

ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో వైసీపీ మద్దతు ఎవరికి ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాత్రం కాంగ్రెస్ నుంచి ఎలాంటి ఆహ్వానం లేదంటూనే వచ్చినా వెళ్లబోమని చెప్పడం విశేషం.

news18-telugu
Updated: May 17, 2019, 6:08 PM IST
జగన్ మద్దతు వారికే.. హింట్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి
వైవీ సుబ్బారెడ్డి(Image: Facebook)
  • Share this:
కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో, ఆ పార్టీకే వైసీపీ కూడా మద్దతిస్తుందని వైసీపీ నేత, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడే మే 23వ తేదీ యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ నిర్వహించే సమావేశానికి సంబంధించి వైసీపీకి ఎలాంటి ఆహ్వానం ఇంతవరకు అందలేదని చెప్పారు. ఒకవేళ అందితే ఆ తర్వాత దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయినా, యూపీఏ సమావేశానికి వెళ్లడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదని చెప్పారు. కాబట్టి, వైసీపీ వేచి చూసే ధోరణిలో ఉందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో వైసీపీ మద్దతు ఎవరికి ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టూర్లు వేస్తున్నారు. జగన్ కూడా తన వెంట ఉన్నారని ఆయన చెప్పకనే చెబుతున్నారు. టీఆర్ఎస్, వైసీపీ కలసి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉందని రెండు పార్టీల నేతలు లెక్కలు వేస్తున్నారు. వైసీపీకి కూడా పెద్ద ఎత్తున లోక్‌సభ సీట్లు వచ్చే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకు ఎలాంటి స్టాండ్ తీసుకోనట్టే కనిపిస్తోంది. అయితే, వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాత్రం కాంగ్రెస్ నుంచి ఎలాంటి ఆహ్వానం లేదంటూనే వచ్చినా వెళ్లబోమని చెప్పడం విశేషం.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>