టీడీపీలో మిగిలేది ఆ ముగ్గురేనా?.. వైసీపీలో చర్చ...

సీఎం జగన్ తలుచుకుంటే అర్ధగంటలో టీడీపీ ఖాళీ అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. తమతో 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీజేపీ ఎంపీ చెబుతున్నారు.

news18-telugu
Updated: November 22, 2019, 8:10 PM IST
టీడీపీలో మిగిలేది ఆ ముగ్గురేనా?.. వైసీపీలో చర్చ...
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. టీడీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పాటు వైసీపీ నుంచి కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు చెప్పారు. అయితే, సుజనా చౌదరి వ్యాఖ్యలకు టీడీపీ, వైసీపీలు కౌంటర్ ఇచ్చాయి. తమ పార్టీల నుంచి ఎవ్వరూ వెళ్లడం లేదని తెలిపాయి. అయితే, గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అందులో వల్లభనేని వంశీ అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటానని ప్రకటించి.. ఆ తర్వాత జగన్‌కు మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పారు.

సీఎం జగన్ తలుచుకుంటే అర్ధగంటలో టీడీపీ ఖాళీ అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. తమతో 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీజేపీ ఎంపీ చెబుతున్నారు. 23 మంది ఎమ్మెల్యేల్లో 20 మందిని మినహాయిస్తే.. ఇంకా మిగిలేది ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరై ఉంటారనే విషయాన్ని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన పయ్యావుల కేశవ్ (ప్రస్తుతం ఈయన పీఏసీ చైర్మన్‌) మాత్రమే ఆ పార్టీలో మిగులుతారని అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు.

First published: November 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు