జగన్ కేబినెట్‌లో ఆ ఇద్దరే బెస్ట్ మినిస్టర్లు?

జగన్ కాకుండా ఆయన కేబినెట్‌లో బెస్ట్ మంత్రులు ఎవరనే చర్చ ఈ మధ్య జరుగుతోంది. జగన్ సీఎంగా పగ్గాలు చేపట్టి ఆరు నెలలు దాటిన నేపథ్యంలో ఈ ఆరు నెలల్లో ఏ మంత్రి బెస్ట్ అనే చర్చ మొదలైంది.

news18-telugu
Updated: December 14, 2019, 6:51 PM IST
జగన్ కేబినెట్‌లో ఆ ఇద్దరే బెస్ట్ మినిస్టర్లు?
ఏపీ కేబినెట్ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఆరు నెలల పాలనలో బెస్ట్ సీఎం అనిపించుకుంటానని ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రకటించారు. అయితే, జగన్ కాకుండా ఆయన కేబినెట్‌లో బెస్ట్ మంత్రులు ఎవరనే చర్చ ఈ మధ్య జరుగుతోంది. జగన్ సీఎంగా పగ్గాలు చేపట్టి ఆరు నెలలు దాటిన నేపథ్యంలో ఈ ఆరు నెలల్లో ఏ మంత్రి బెస్ట్ అనే చర్చ మొదలైంది. అయితే, జగన్ కేబినెట్‌లో పనిచేస్తున్న వారిలో చాలా మంది పేర్లు కూడా సాధారణ ప్రజలకు తెలియవు. ఎవరో కొందరు మంత్రుల పేర్లుమాత్రమే ప్రధానంగా ప్రజలకు వినిపిస్తున్నాయి. వారిలో ప్రధానంగా కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కన్నబాబు లాంటి వారి పేర్లు మాత్రమే బాగా వినిపిస్తున్నాయి. మంత్రులు కాకుండా, ఎమ్మెల్యే రోజా, అంబటి రాంబాబు వంటి వారు కూడా మీడియాలో చంద్రబాబు, టీడీపీ, జనసేనకు భారీగా కౌంటర్లు ఇస్తున్నారు.

అయితే, జగన్ కేబినెట్‌లోని మంత్రుల్లో కొడాలి నాని ఈ మధ్య బాగా పాపులర్ అయ్యారు. అయితే, ఆయన చంద్రబాబును తిట్టడం ద్వారా ఫేమస్ అయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ కూడా చాలెంజ్‌లు, తిట్టడాల వల్లే కొంచెం పేరు వచ్చిందని ఆ పార్టీలో నేతలు చర్చించుకుంటున్నారు. మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు లాంటి వారు తాము చెప్పాలనుకున్నది సూటిగా చెబుతున్నారు. వివాదాల జోలికి వెళ్లడం లేదు. అయితే, ప్రతిపక్షానికి దీటుగా కౌంటర్లు ఇస్తూనే, ఎక్కడా ‘గీత’ దాటకుండా వ్యవహరించడంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చలాకీగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ బయట బొత్స తనదైన శైలిలో విపక్షాలకు కౌంటర్లు ఇస్తుంటే, అసెంబ్లీ లోపల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన మార్క్ సెటైర్లు, పిట్ట కథలతో ప్రతిపక్షాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా, అటు పార్టీ వాదనను, ప్రభుత్వ వాదనను బలంగా వినిపించడంలో ఆ ఇద్దరు మంత్రులు బాగా పనిచేస్తున్నారని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు.

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>