బీజేపీతో టచ్‌లో ఉన్న ఎంపీలు ఎవరు?.. సుజనాకు వైసీపీ ప్రశ్న

‘మేం ఊపిరి ఉన్నంతవరకు జగన్‌తోనే ఉంటాం. జగన్ తలుపులు తెరిస్తే అరగంటలో టీడీపీ మొత్తం ఖాళీ అవుతుంది.’ అని వైసీపీ ఎంపీ రెడ్డప్ప అన్నారు.

news18-telugu
Updated: November 22, 2019, 3:26 PM IST
బీజేపీతో టచ్‌లో ఉన్న ఎంపీలు ఎవరు?.. సుజనాకు వైసీపీ ప్రశ్న
వైసీపీ ఎంపీలతో సీఎం జగన్ (File)
  • Share this:
బీజేపీలో చేరేందుకు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారని ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై వైసీపీ ఎంపీలు సుజనా చౌదరికి కౌంటర్ ఇచ్చారు. బీజేపీతో టచ్‌లో ఉన్న ఎంపీలు ఎవరోచెప్పాలని డిమాండ్ చేశారు. నలుగురు కాదని, ఒక్కరి పేరైనా చెప్పాలని సవాల్ విసిరారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు రెడ్డప్ప, నందిగం సురేష్, బొడ్డేటి మాధవి తదితర వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ‘మేం ఊపిరి ఉన్నంతవరకు జగన్‌తోనే ఉంటాం. జగన్ తలుపులు తెరిస్తే అరగంటలో టీడీపీ మొత్తం ఖాళీ అవుతుంది.’ అని వైసీపీ ఎంపీ రెడ్డప్ప అన్నారు. బ్యాంకులకు రూ.6వేల కోట్లు ఎగ్గొట్టి నీతులు చెబుతున్నారంటూ సుజనా చౌదరి మీద మండిపడ్డారు. బీజేపీలో ఉంటూ టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

మరో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. ‘సుజనా చౌదరి గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తే బ్యాంక్ దొంగ అని వస్తుంది. ఆయన ఒరిజినల్ బీజేపీనా?, డూప్లికేట్ బీజేపీనా?. సుజనాను జిరాక్స్ తీస్తే టీడీపీ అని వస్తుంది. ఒక పార్టీలో గెలిచిమరోపార్టీలో చేరే వాళ్లం కాదు.’ అని ఆరోపించారు. పార్లమెంట్ సెంట్రల్ హాలుకు వచ్చి తన ‘కన్నాలు’ పూడ్చుకోవడం ఎలాగో ఆలోచిస్తూ ఉంటారని నందిగం సురేష్ మండిపడ్డారు. ఏపీలో టీడీపీ చచ్చిపోయిందని, దీన్ని బ్రతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేదని సురేష్ అన్నారు. సుజనా చౌదరికి అంత ప్రేమ ఉంటే, మిగిలిన టీడీపీ వారిని తీసుకెళ్లాల్సిందిగా సూచించారు.

First published: November 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు