Home /News /politics /

Karimnagar mlc : ఇదేందయ్యా ! అభ్యర్థి బరిలో లేకున్నా కాంగ్రెస్ క్యాంప్ రాజకీయం -ఎవరికి ఓటేయబోతున్నారు?

Karimnagar mlc : ఇదేందయ్యా ! అభ్యర్థి బరిలో లేకున్నా కాంగ్రెస్ క్యాంప్ రాజకీయం -ఎవరికి ఓటేయబోతున్నారు?

కరీంనగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాంప్ రాజకీయం

కరీంనగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాంప్ రాజకీయం

కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతోన్న ఎన్నికలు మరింత సరవత్తరంగా మారాయి. అధికార టీఆర్ఎస్ బాటలోనే విపక్ష కాంగ్రెస్ సైతం క్యాంపులకు శ్రీకారం చుట్టింది. నిజానికి ఈ ఎన్నికలో కాంగ్రెస్ తరఫున అభ్యర్థి బరిలో లేకున్నా.. ఉన్న కొద్దిపాటి ఓట్లు చీలిపోకుండా ..

ఇంకా చదవండి ...
  (P.Srinivas,News18,Karimnagar)
  తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీకి సవాలుగా మారాయి. మొత్తం 12 స్థానాలనూ ఏకగ్రీవం చేసుకోవాలన్న ప్రయత్నం ఫలించకపోవడంతో ఆరు చోట్ల ఎన్నిక తప్పడంలేదు. ఈనెల 10న పోలింగ్ జరగాల్సి ఉండగా రెబల్స్ బెడదతో టీఆర్ఎస్ తన ఓటర్లయిన ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించింది. విచిత్రంగా విపక్ష కాంగ్రెస్ సైతం ఇప్పుడు క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో లేకున్నా ఆ పార్టీ తన ఓటర్లతో క్యాంపులు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ రెబల్ సర్దార్ రవీందర్ సింగ్ కు బీజేపీ బాహాటంగా మద్దతు పలికిన నేపథ్యంలో క్యాంపులకు తరలివెళుతోన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిదులు ఎవరికి ఓటేయబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. వివరాలివి..

  కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతోన్న ఎన్నికలు మరింత సరవత్తరంగా మారాయి. అధికార టీఆర్ఎస్ బాటలోనే విపక్ష కాంగ్రెస్ సైతం క్యాంపులకు శ్రీకారం చుట్టింది. నిజానికి ఈ ఎన్నికలో కాంగ్రెస్ తరఫున అభ్యర్థి బరిలో లేకున్నా.. ఉన్న కొద్దిపాటి ఓట్లు చీలిపోకుండా .. వాళ్లలో ఏ ఒక్కరూ అధికార టీఆర్ఎస్ వైపునకు ఆకర్షితులవకుండా కాంగ్రెస్ నేతలు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అయితే, అభ్యర్థిని నిలపని కాంగ్రెస్.. తన ప్రజాప్రతినిధులతో ఎవరికి ఓటేయించబోతోందనేది జిల్లాలో టెన్షన్ రేపుతున్నది..

  Suryapet : కూతురు అలా మంచంపై ఉండగా తల్లిని కామ కోరిక తీర్చమన్నాడు.. ఆ రాత్రి జరిగింది చూసి తట్టుకోలేక..



  కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మంథని నియోజవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులను హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 40 మంది వరకు ప్రజాప్రతినిధులు హైదరాబాద్ క్యాంపునకు వెళ్లిపోగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జగిత్యాల , సిరిసిల్ల , పెద్దపల్లి , కరీంనగర్ పరిధిలోని మొత్తం 13 నియోజకవర్గాల్లోని తమ ప్రజాప్రతినిదులను కూడా హైదరాబాద్ క్యాంపులకు తరలించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్దమయ్యారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే (మంథని) దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోనే ఈ క్యాంపులు ఏర్పాటవుతున్నట్లు తెలుస్తోంది. అయితే సొంత పార్టీ అభ్యర్థి లేకపోవడంతో కాంగ్రెస్ ఓటర్లు ఎవరికి ఓటేస్తారనేది కీలకంగా మారింది.

  Peddapalli RDO : భోళా శంకర్! -అలా క్యాష్ కొడితే.. ఇలా చెక్కిస్తాడు.. -ఆ పనికి అస్సలు సిగ్గు పడరు..



  అధికార టీఆర్ఎస్.. తన 1000 మంది ప్రజాప్రతినిధులను కుటుంబాలతో సహా బెంగళూరు, గోవా, ముంబైలోని క్యాంపులకు తరలించింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తన ప్రజాప్రతినిధులను హైదరాబాద్ క్యాంపులకు తరలిస్తుండటంతో ఒక్క ఓటరు లేకుండానే నేతలు ప్రచారం సాగిస్తున్నట్లయింది. టీఆర్ఎస్ అభ్యర్థులు ఎల్ . రమణ , భానుప్రసాద్ రావు , టీఆర్ఎస్ రెబల్ సర్దార్ రవీందర్ సిం గ్, ఇతర అభ్యర్థులు ప్రభాకర్ రెడ్డి , సత్యనారాయణ తదితరులు కరీంనగర్ జిల్లాలో ఉంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రత్యక్షంగా ఓటర్లెవరూ అక్కడ లేకపోవడంతో నేతలు తెలివిగా సోషల్ మీడియాలో, సాధారణ మీడియా ద్వారా ప్రచారం సాగిస్తున్నారు. నిత్యం మీడియా సమావేశాలు, సోషల్ మీడియాలో ప్రచారాలతో నేతలు బిజీగా ఉన్నారు. ఓటర్లు లేకుండా జిల్లాలో జరుగుతోన్న తొలి ఎన్నికలు ఇవేనని , ఇలాంటి విచిత్ర పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదని పలువురు సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నరు.

  మీ నగరం నుండి (కరీంనగర్)

  తెలంగాణ
  కరీంనగర్
  తెలంగాణ
  కరీంనగర్
  Published by:Madhu Kota
  First published:

  Tags: Congress, Karimnagar, Mlc elections, Trs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు