ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన బాగుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంగీకరించినట్టేనా? ఆయన చేసిన పనే ఆ ప్రశ్నను ఉత్పన్నం చేస్తుంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళే సినిమా షూటింగ్‌కు హాజరయ్యారు. హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సి నటించిన పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. తొలిరోజే పవన్ కల్యాణ్ సెట్‌కి వచ్చారు. మేకప్ వేసుకుని కెమెరా ముందు ఓ సీన్లో నటించారు. 10 రోజుల పాటు నాన్‌స్టాప్ షెడ్యూల్ జరగనుంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కాస్త బ్రేక్ తీసుకోనున్నాడు. ఫిబ్రవరిలో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తెలుగులో దీనికి లాయర్ సాబ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించే అవకాశం కనిపిస్తుంది.
గతంలో పవన్ కళ్యాణ్ ఓ కీలక వ్యాఖ్య చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన బాగుంటే.. తాను చక్కగా వెళ్లి సినిమాలు చేసుకుంటా కదా అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు సినిమా చేయడం అంటే జగన్ పాలన బాగుందని పవన్ కళ్యాణ్ ఒప్పుకొన్నట్టేనా అని వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Pawan kalyan, Pink