
రాజ్యసభలో ప్రసంగిస్తున్న అమిత్ షా
జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితి మామూలుగా అయినప్పుడు మళ్లీ దాన్ని రాష్ట్రంగా మార్చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితి మామూలుగా అయినప్పుడు మళ్లీ దాన్ని రాష్ట్రంగా మార్చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. రాజ్యసభలో ఆయన సమాధానం ఇచ్చారు. జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై రాజ్యసభలో చాలా మంది సభ్యులుకొన్ని సందేహాలను లేవనెత్తారు. వాటికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. జమ్మూకాశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం, లద్దాక్‌ను అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. ఐదేళ్లలో జమ్మూకాశ్మీర్ దశ మారుస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామన్నారు. 370 రద్దు కోసం తాము ఎందుకు పట్టుబట్టామో విపక్షాలకు అప్పుడు తెలుస్తుందని అమిత్ షా అన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:August 05, 2019, 18:28 IST