Home /News /politics /

WHEN PEOPLE PRAYED FOR MY DEATH IN VARANASI PM MODI DIG AT SAMAJWADI AKHILESH YADAV DURING UP POLL CAMPAIGN MKS

PM Modi: కొందరు నా చావును కోరుకుంటున్నారు.. అందుకు సంతోషం: కాశీలో మోదీ

వారణాసి సభా ప్రాంగణంలో  ప్రధాని మోదీ

వారణాసి సభా ప్రాంగణంలో ప్రధాని మోదీ

చావు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. మోదీ చివరి చరణం కాశీలోనే అంటూ గతంలో అఖిలేశ్ యాదవ్ చేసిన కామెంట్లకు మోదీ ఇప్పుడు బదిలిచ్చారు.

‘కొందరు నేతల పూర్తిగా దిగజారిపోయినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా నా చావును కూడా కోరుతున్నారు. వారణాసిలోనే నేను చనిపోవాలని కోరుతున్నారు. అయితే ఈ విషయంలో నేను సంతోషంగా ఉన్నాను. నా చివరి జీవితం వారణాసి ప్రజలతో ఉండటం, ప్రాణం పోయేదాకా వారికి సేవలు చేసుకునే భాగ్యం దక్కుతున్నందుకు ఆనందంగా ఉంది’అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చావు నేపథ్యంలో అనూహ్య వ్యాఖ్యలు చేశారు. మోదీ చివరి చరణం కాశీలోనే అంటూ గతంలో అఖిలేశ్ యాదవ్ చేసిన కామెంట్లకు మోదీ ఇప్పుడు బదిలిచ్చారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరాయి. ఆదివారం ఐదో దశ పోలింగ్ పూర్తికాగా, మరో రెండు విడతల్లో ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి. యూపీలో చివరి రెండు దశల్లో పోలింగ్ జరుగనున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసి లోక్ సభ సెగ్మెంట్ కూడా ఉంది. ఆదివారం వారణాసిలో జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు.

Russia Ukraine War: అణు బాంబులు సిద్దం చేయండి: శాంతి చర్చల వేళ పుతిన్ షాకింగ్ ఆదేశాలు


యూపీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న వేళ ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, చివరికి తన చావును సైతం కోరుకుంటున్నారంటూ విమర్శించారు. ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ గతేడాది ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలనుద్దేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

CM KCR ఫామ్‌హౌజ్‌లో Prashant Kishor -తెలంగాణలో ముందస్తు ఎన్నికలు! -TRS భారీ వ్యూహం


గతేడాది ప్రధాని మోదీ వారణాసిలో ఒక రోజు పర్యటించిన సందర్భంలో అఖిలేశ్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మంచిదే. ఒకరోజు కాదు.. మూడు నెలలైనా వారణాసిలో ఉండొచ్చు. అలా ఉండడానికి పూర్తి అనువైన ప్రదేశం. ఎందుకంటే చివరి రోజుల్లో అందరూ వారణాసిలోనే గడపాలని కోరుకుంటారు" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే అఖిలేశ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. నాటి వ్యాఖ్యలకు మోదీ ఇవాళ ఎన్నికల ప్రచారంలో కౌంటరివ్వడం గమనార్హం.

Russia Ukraine War: ముగింపు దిశగా యుద్ధం!.. రష్యాతో ఉక్రెయిన్ శాంతి చర్చలు షురూ.. అజెండా ఇదే..


యూపీలో ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి 53.98 శాతం ఓటింగ్ నమోదైంది. ఇవాళ యూపీలో 12 జిల్లాల్లో 61 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 692 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది.
Published by:Madhu Kota
First published:

Tags: Akhilesh Yadav, Assembly Election 2022, Bjp, Pm modi, Uttar pradesh, Varanasi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు