మోదీ కాళ్లపై పడబోయిన జగన్.. వారించిన ప్రధాని

news18-telugu
Updated: June 9, 2019, 6:33 PM IST
మోదీ కాళ్లపై పడబోయిన  జగన్.. వారించిన ప్రధాని
రేణిగుంట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన వైఎస్ జగన్ (Image:ANI)
  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఓ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత తొలిసారి తిరుపతి వచ్చిన ప్రధాని మోదీకి రేణిగుంట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలువురు వైసీపీ, బీజేపీ నాయకులు మోదీకి స్వాగతం పలికారు. విమానంలో నుంచి దిగిన తర్వాత తొలుత గవర్నర్ నరసింహన్ ఓ రోజా పువ్వు ఇచ్చి మోదీకి వెల్కం చెప్పారు. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోజా పువ్వు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని కాళ్లకు నమస్కారం పెట్టడానికి జగన్ ప్రయత్నించారు. అయితే, జగన్ చేతులు పట్టుకుని ఉన్న మోదీ వద్దని వారించారు. వారిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండగానే జగన్ మరోసారి మోదీ కాళ్లకు నమస్కారం చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా మోదీ.. జగన్‌ను వారించారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి .. మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చిన వైసీపీ నాయకులను ప్రధానికి పరిచయం చేశారు.

First published: June 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading