జాగ్రత్తగా ఉండండి.. లేకపోతే: పొలిటికల్ పార్టీలకు వాట్సాప్ వార్నింగ్..

WhatsApp | వాట్సప్‌ను దుర్వినియోగం చేయాలని చూస్తే సర్వీసులు బ్యాన్ చేస్తామంటూ వాట్సప్ సంస్థ రాజకీయ పార్టీలను హెచ్చరించింది.

news18-telugu
Updated: February 6, 2019, 10:29 PM IST
జాగ్రత్తగా ఉండండి.. లేకపోతే: పొలిటికల్ పార్టీలకు వాట్సాప్ వార్నింగ్..
వాట్సప్, ఫేస్ బుక్
  • Share this:
2019 సాధారణ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలకు ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ సంస్థ వాట్సప్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. వాట్సప్‌‌‌ను దుర్వినియోగం చేయాలని చూస్తే బ్యాన్ చేస్తామని హెచ్చరించింది. అయితే, ఏ రాజకీయ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు? ఆయా పార్టీలు ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నాయనే విషయాన్ని మాత్రం బయటకు వెల్లడించలేదు.

WhatsApp Fingerprint, WhatsApp face id, WhatsApp new features, WhatsApp features 2019, WhatsApp Emojis, WhatsApp New Emojis, వాట్సప్ ఫింగర్‌ప్రింట్, వాట్సప్ కొత్త ఫీచర్లు, వాట్సప్ ఫీచర్లు 2019, వాట్సప్ ఎమొజీ, వాట్సప్ ఫేస్ ఐడీ
వాట్సప్ (image: Reuters)


‘కొన్ని పార్టీలు వాట్సప్‌ను దుర్వినియోగం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి పార్టీలకు ఒక్కటే చెబుతున్నాం. వారి పద్ధతి మార్కుకోకపోతే మా సర్వీసులు బ్యాన్ చేస్తాం.’ అని వాట్సప్ కమ్యూనికేషన్స్ హెడ్ కార్ల్ వూగ్ హెచ్చరించినట్టు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. వాట్సప్‌లో ఎలాంటి అసభ్యకర, అభ్యంతరమైనవి లేకుండా చూడాలని మేం కోరుకుంటున్నాం. అలాంటివి లేకుండా చేయడానికి మేం ఎప్పటికప్పుడు కృషిచేస్తున్నాం. ’అని కార్ల్ వూగ్ తెలిపారు.

ఫేక్‌న్యూస్‌పై పోరాటం: టీవీల్లో వాట్సప్ యాడ్స్, WhatsApp Launches TV Campaign in India to Fight Fake News
ప్రతీకాత్మక చిత్రం
వాట్సప్ సంస్థ తమతో ఎలాంటి ఎలాంటి చర్చలు జరపలేదని బీజేపీ సోషల్ మీడియా సెల్ ఇన్‌చార్జి అమిత్ మాల్వీయ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వాట్సప్‌‌ను దుర్వినియోగం చేయదని ఆ పార్టీ సోషల్ మీడియా హెడ్ దివ్య స్పందన తెలిపారు. వాట్సప్‌ సంస్థకు భారత్‌లో నెలకు 200 మిలియన్ల యూజర్లు ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో ఇండియా ఒకటి. దేశంలోని రాజకీయ పార్టీలు కూడా వాట్సప్‌ను తమ ప్రచారంలో భాగం చేశాయి. వాట్సప్ యాప్‌ను బీభత్సంగా వాడుకుంటున్నాయి.

a new study told that, above 65 years old people sharing fake news more than youngsters | ఫేక్ న్యూస్‌ని ఎక్కువగా షేర్ చేసేది ఆ వయసువాళ్లే?
Fake news


గతంలో వాట్సప్‌లో జరిగిన దుష్ప్రచారం వల్ల కొన్ని దుర్ఘటనలు జరిగాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మి కొందరు యువకుల మీద మూకదాడులు జరిగాయి. దీంతో వాట్సప్ వేదికగా జరుగుతున్న ఫేక్ న్యూస్ ప్రచారాన్ని అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో చెప్పాలంటూ ఓ దశలో కేంద్ర హోంశాఖ వాట్సప్‌కు నోటీసులు కూడా ఇచ్చింది.
Loading...
Whats app new features, Whats app new decision on fake news, fake news with Whats app,Whats app forwards, వాట్సాప్, వాట్సాప్ కొత్త ఫీచర్స్,వాట్సాప్ కొత్త నిర్ణయం, ,Whats app has taken another new decision to control fake news,మరింత కఠినంగా వాట్సాప్..వినియోగదారులకు చేదువార్త
ప్రతీకాత్మక చిత్రం


మూకదాడల తర్వాత ఫేక్ న్యూస్‌‌కు అడ్డుకట్ట వేసేందుకు వాట్సప్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకేసారి ఐదుగురు వ్యక్తులు లేదా గ్రూపులకు మించి ఫార్వర్డ్ చేయడానికి వీల్లేకుండా కట్టడి చేసింది. అలాగే, ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అని తెలిపేలా ‘ఫార్వర్డ్’ అని పైన కనిపించేలా డెవలప్‌ చేసింది.
First published: February 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...