Home /News /politics /

WHATSAPP GROUPS AWASH WITH RUMOURS ABOUT EX PRIME MINISTER RAJIV GANDHI BS

రాజీవ్ గాంధీ ఫుల్లుగా తాగేవారా?.. ఆయన హత్య విషయం సోనియాకు ముందే తెలుసా?.. వాట్సాప్‌లో..

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ

‘రాజీవ్ గాంధీ తన జీవితంలో మొత్తం 181 ర్యాలీలకు హాజరయ్యారు. అందులో 180 ర్యాలీలకు సోనియాగాంధీ కూడా హాజరయ్యారు. ఒక్క ర్యాలీకే హాజరు కాలేదు.. ఆ ర్యాలీలోనే రాజీవ్ హత్యకు గురయ్యారు.’

    ‘రాజీవ్‌గాంధీ తన జీవితాన్ని నంబర్ 1 అవినీతిపరుడిగా ముగించుకున్నారు..’ ఇదీ ఉత్తరప్రదేశ్ ర్యాలీ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్య. అంతేకాదు సొంత పర్యటన కోసం ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను వాడేవారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో మాజీ ప్రధాని గురించి పలు రూమర్లు వ్యాపిస్తున్నాయి. ‘రాజీవ్ గాంధీ తన జీవితంలో మొత్తం 181 ర్యాలీలకు హాజరయ్యారు. అందులో 180 ర్యాలీలకు సోనియాగాంధీ కూడా హాజరయ్యారు. ఒక్క ర్యాలీకే హాజరు కాలేదు.. ఆ ర్యాలీలోనే రాజీవ్ హత్యకు గురయ్యారు.’ అంటే.. ఆ విషయం సోనియాకు తెలుసా? అన్న విధంగా వాట్సాప్ గ్రూప్‌లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

    ఇంకా..
    ‘రాజీవ్‌గాంధీని బీబీసీ ప్రధానిని చేయాలనుకుంది. అందుకే ఆయనకు మద్దతుగా రేడియో ప్రచారం చేపట్టింది’

    ‘కేజ్రీవాల్‌ను భారత్‌లోనే కొట్టారు. కానీ, రాజీవ్‌ను ప్రపంచవ్యాప్తంగా కొట్టారు’-1987లో ఓ శ్రీలంక నావికుడు ఆయనపై దాడి చేసినట్లు వీడియో వైరల్ అవుతోంది

    ‘యూకేలో ఉన్నపుడు రాజీవ్ ఫుల్లుగా మందు కొట్టేవారు. అలా బాగా తాగి అన్ని పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు -అందుకే ఆయన్ను కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి తరిమేశారు’


    సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న కొన్ని పోస్టులు


    Rahul Gandhi, Congress chief Rahul Gandhi, Congress, Rajiv Gandhi, PM Narendra Modi, PM Modi,election commission of india, ec, rahul gandhi, rajeev gandhi,sonia gandhi,amethi, prime minister, narendra modi, lok sabha election, lok sabha elections, lok sabha election 2019, lok sabha elections 2019, లోక్ సభ ఎన్నికలు, చంద్రబాబు, టీడీపీ, వైఎస్ జగన్, వైసీపీ, పవన్ కళ్యాణ్, జనసేన, ఎన్నికల ఫలితాలు, సర్వే, ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్, ప్రధాన మంత్రి, నరేంద్ర మోదీ, టీఆర్ఎస్, కేసీఆర్, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ,సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఈసీ, lok sabha elections 2019, narendra modi, west bengal, mamata banerjee, uttarpradesh elections 2019, delhi, rahul gandhi, లోక్‌సభ ఎన్నికలు 2019, పశ్చిమ బెంగాల్, రాహుల్ గాంధీ, ఢిల్లీ, రాజీవ్ యూకే, కేంబ్రిడ్జి యూనివర్సిటీ,cambridge,
    సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న కొన్ని పోస్టులు


    రాజీవ్ గాంధీ ముస్లిం అని, ఆయన అసలు పేరు ‘రాజీవ్ ఖాన్’ అని ఆరు నిమిషాల వీడియో కూడా సర్క్యులేట్ అవుతోంది. పలు కామెంట్లు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నాయి. రాజీవ్‌పై మోదీ ఆరోపణలు చేసిన మరుసటి రోజు నుంచే ఇలాంటి పుకార్లు ఒక్కసారిగా పుట్టుకొచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.



    First published:

    Tags: Aicc, Congress, Lok Sabha Elections 2019, Narendra modi, Pm modi, Priyanka Gandhi, Rahul Gandhi, Rajiv Gandhi, Sonia Gandhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు